బోయపాటి బాడీ డబుల్.. క్లారిటీ ఇచ్చిన రామ్

స్కంద సినిమా థియేటర్లలో రిలీజైనప్పుడు ఎంత ట్రోలింగ్ నడిచిందో, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ ట్రోలింగ్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఓ షాట్ లో రామ్ బదులు బోయపాటి కనిపించిన తీరుపై…

స్కంద సినిమా థియేటర్లలో రిలీజైనప్పుడు ఎంత ట్రోలింగ్ నడిచిందో, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ ట్రోలింగ్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఓ షాట్ లో రామ్ బదులు బోయపాటి కనిపించిన తీరుపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ షాట్ బాగా వైరల్ అవ్వడంతో రామ్ స్పందించాడు.

తను చేయాల్సిన యాక్షన్ సన్నివేశంలో బోయపాటి ఎందుకు నటించాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చాడు రామ్. ఆ ఒక్క సీన్ లో తన బాడీ డబుల్ గా బోయపాటి కనిపించిన విషయాన్ని నిర్థారించాడు.

“నాకు బాగా గుర్తు. ఏప్రిల్ 22వ తేదీ అది. వేసవి మంచి పీక్ లో ఉన్న టైమ్ అది. 25 రోజుల షెడ్యూల్, 3 రోజుల షూటింగ్ కే నా పాదం దెబ్బతింది. సరిగ్గా నడవలేకపోయాను. పగుళ్లు వచ్చి రక్తం కారడంతో స్పాట్ నుంచి తప్పుకున్నాను. అందుకే నా దర్శకుడు ఆ షాట్ లో నటించాడు”

ఇలా ఓ యాక్షన్ సీన్ లో బోయపాటి కనిపించిన అంశంపై స్పందించాడు రామ్. ఈ సందర్భంగా తన కాలికి గాయాలైన ఫోటొను కూడా అతడు షేర్ చేశాడు. ఈ సందర్భంగా సినిమా ఫెయిల్యూర్ పై కూడా స్పందించాడు ఈ హీరో.

“సినిమాను ఇష్టపడాలా వద్దా అనేది పూర్తిగా ప్రేక్షకుల నిర్ణయం. వాళ్ల ఛాయిస్ ను నేను గౌరవిస్తాను. ఇకపై కూడా గౌరవిస్తూనే ఉంటాను. ఇదంతా చేసింది ప్రేక్షకుల కోసమే. ఇకపై కూడా ఇలానే ప్రేక్షకుల కోసం నా రక్తాన్ని, స్వేదాన్ని చిందిస్తాను.”

స్కందలో తన కోసం ఆ ఒక్క షాట్ లో నటించిన బోయపాటికి రామ్ థ్యాంక్స్ చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే టైమ్ లో జోరుగా ట్రోలింగ్ కూడా నడుస్తోంది.