మోడీ పాలనకు ఇక పగ్గాలుండవా!

నరేంద్రమోడీ పరిపాలనకు ఇక పట్టపగ్గాలు లేకుండా పోతాయా? ఇప్పటి దాకా అంతో ఇంతో అవసరాన్ని బట్టి ఇతర పార్టీల మద్దతు మీద ఆధారపడుతూ వస్తున్న మోడీ సర్కారు.. ఇకపై యథేచ్ఛగా చెలరేగిపోనున్నదా? అనే సందేహాలు…

నరేంద్రమోడీ పరిపాలనకు ఇక పట్టపగ్గాలు లేకుండా పోతాయా? ఇప్పటి దాకా అంతో ఇంతో అవసరాన్ని బట్టి ఇతర పార్టీల మద్దతు మీద ఆధారపడుతూ వస్తున్న మోడీ సర్కారు.. ఇకపై యథేచ్ఛగా చెలరేగిపోనున్నదా? అనే సందేహాలు ఇప్పుడే ముసురుకుంటున్నాయి. ఈ ఏడాది చివరికెల్లా రాజ్యసభలో వచ్చే ఖాళీలు, అవి భర్తీ అయ్యే తీరు తెన్నులను గమనిస్తే.. నరేంద్ర మోడీ సర్కారు రాబోయే మూడున్నరేళ్లపాటూ తిరుగులేని.. ‘ఎవరినీ లెక్కచేయని’ ప్రభుత్వంగా అవతరిస్తుందనే అభిప్రాయం కలుగుతోంది.

రెండోసారి తమ ఒక్క పార్టీకే ప్రజలు సంపూర్ణమైన మెజారిటీని కట్టబెట్టిన తర్వాత.. నరేంద్రమోడీ ప్రభుత్వం దూకుడు పెరిగింది. ఆర్టికల్ 370 రద్దు వంటివి ఈ కొత్త బలం ఫలితాలే. ఇంతా కలిపి ఎన్నార్సీ, సీఏఏ వంటి బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది, చట్టాల రూపం దాల్చడానికి నరేంద్రమోడీ సర్కారు… తిరిగి తమ కూటమిలోని కొన్ని పార్టీల మీద ఆధారపడింది. అలాంటి కీలక బిల్లుల విషయంలో మోడీ సర్కారుకు సహకరించిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం కూడా ఉన్నాయి.

అయితే కొత్త రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తున్నప్పుడు.. ఈ ఏడాదిలో రాజ్యసభలో ఎన్డీయే బలం బాగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 245 మంది సభ్యలున్న రాజ్యసభలో భాజపా ప్రస్తుత బలం 114 మాత్రమే. విపక్షాలు అన్నీ  కలిపి 124 సభ్యుల బలం కలిగి ఉన్నాయి. మిగిలినవి ఖాళీలు. ఈ ఏడాది మొత్తం 68 సీట్లు ఖాళీ అవుతున్నాయి. వీటిలో.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ చాలా స్థానాలను కోల్పోతుంది.

అదే సమయంలో.. భాజపా బలం బాగా పెరుగుతుంది. మొత్తంగా ప్రస్తుతం ఉన్నదానికంటె వారి బలం 15 స్థానాల వరకు పెరుగుతుందనేది ఒక అంచనా. అదే జరిగితే సింపుల్ మెజారిటీని ఎన్డీయే కూటమి అధిగమించేస్తుంది. విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా.. మోడీ అమ్ముల పొదిలో ఉండే.. హిందూత్వ ఎజెండాలోని వివాదాస్పద ఆలోచనలన్నీ.. ఇక చట్టాల రూపం దాలుస్తాయి. పార్లమెంటు ఉభయసభల్లోనూ వారిని అడ్డుకునేవారుండరు గనుక.. మోడీ పాలనకు పగ్గాలుండవని పలువురు అంచనా వేస్తున్నారు.

ఏ జోనర్ చేసినా ఫ్లాపులు పలకరించాయి