శైలజానాధ్ కామెడీ పండిస్తున్నారు…!

పీసీసీ ప్రెసిడెంట్ గా సాకె శైలజానాధ్ జిల్లా టూర్లు చేస్తున్నారు. పార్టీలో మిగిలిన కార్యకర్తలు నాయకులను ఆయన చూసుకుంటున్నారు. ఇది మంచిదే. ఎందుకంటే  పార్టీలో ఎవరు ఉన్నారో, ఎవరు లేరో చూసుకుంటే పని సులువు…

పీసీసీ ప్రెసిడెంట్ గా సాకె శైలజానాధ్ జిల్లా టూర్లు చేస్తున్నారు. పార్టీలో మిగిలిన కార్యకర్తలు నాయకులను ఆయన చూసుకుంటున్నారు. ఇది మంచిదే. ఎందుకంటే  పార్టీలో ఎవరు ఉన్నారో, ఎవరు లేరో చూసుకుంటే పని సులువు అవుతుంది కాబట్టి తప్పులేదు.

కానీ ఈ సందర్భంగా శైలజనాధ్ చేస్తున్న కొన్ని  కామెంట్స్ మాత్రం నవ్వు పుట్టిస్తున్నాయి. దేశంలో అన్ని పార్టీల పని అయిపోయింది. బీజేపీని అడ్డుకోవడంలో  అవన్నీ దారుణంగా విఫలం అవుతున్నాయట.

ఒక్క కాంగ్రెస్ కి  మాత్రమే బీజేపీని అడ్డుకోగల సత్తా ఉందని  ఆయన ఢంకా భజాయిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలూ బీజేపీకి పర్యాయపదాలు అంటూ ఎకసెక్కం చేస్తున్నారు.

బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ సెటైర్లు వేసిన పీసీసీ పెద్దాయనది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశ లౌకికతను, సార్వభౌమత్వాన్ని కాపాడుతుందని గట్టిగా చెబుతున్నారు.

మోడీని ఈ విషయంలో  నిలదీయగల సత్తా జగన్ కి ఉందా అని ఆయన అడుగుతున్నారు.  మోడీని ఎదుర్కొంటే జగన్ కి తాము మద్దతు ఇస్తామని కూడా చెబుతున్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే నిన్ననే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ ఎంత ఎదుర్కొందో లోకమంతా చూశారు.

అవన్నీ కళ్ళ ముందే ఉన్నా కూడా ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఏదో పొడిచేస్తుందని శైలజానాధ్ చెప్పడమే అసలైన కామెడీ. ఇక ఏపీలో మేమే అసలైన ప్రజాపక్షం అని కూడా ఆయన జబ్బలు చరుస్తున్నారు.

అలాంటి అబ్బాయి కావాలి..