మోడీని జగన్‌ కలిస్తే.. వీళ్ళలో ఇంత అసహనమా.?

ఇదేమీ రాజకీయ భేటీ కాదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కలవడం అనేది ఓ సహజమైన ప్రక్రియ. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగాల్సిందే. ఈ…

ఇదేమీ రాజకీయ భేటీ కాదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కలవడం అనేది ఓ సహజమైన ప్రక్రియ. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కొనసాగాల్సిందే. ఈ క్రమంలో వివిద అంశాలపై చర్చలు జరుగుతాయి. ఆ చర్చల ఫలితాలు ఎలా వుంటాయన్నది వేరే అంశం. కానీ, ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి ప్రధాన మంత్రిని కలవడమే నేరమంటే ఎలా.? పైగా, అక్కడికేదో ముఖ్యమంత్రి నేరం చేసినట్లు.. ప్రధాన మంత్రి హెచ్చరించారంటూ ప్రచారం చేయడమేంటి.?

ఒకవేళ ముఖ్యమంత్రిని, ప్రధాన మంత్రి గనుక మందలిస్తే.. అది రాష్ట్రానికి అవమానకరమైన విషయమే. ముఖ్యమంత్రిగా తన పరిధిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి వుంటుంది. వాటికి ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఆమోద ముద్ర వేయొచ్చు.. తిప్పి పంపొచ్చు.. అది వేరే విషయం. అంతే తప్ప, ఆ నిర్ణయాలపై ముఖ్యమంత్రికి, ప్రధాని క్లాస్‌ తీసుకునే అవకాశం వుంటుందా.? పైగా, ప్రధాని – ముఖ్యమంత్రి మధ్య జరిగే భేటీ తాలూకు వివరాలు గాసిప్స్‌, లీకుల రూపంలో ‘కొందరికి’ మాత్రమే తెలుస్తాయా.!

ఎక్కడో ఏదో భయం టీడీపీ అనుకూల మీడియాలో కన్పిస్తోంది. టీడీపీ కంటే ఎక్కువగా టీడీపీ అనుకూల మీడియాలో అసహనం పెరిగిపోతోంది. ఈ భయం, అసహనం కారణంగానే.. నిన్నటి మోడీ – జగన్‌ భేటీపై ‘పచ్చ మీడియాలో’ నానా యాగీ జరిగింది.. జరుగుతూనే వుంది. ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీ పర్యటన వెనుక ఉద్దేశ్యాలేంటో, సీఎంవో స్పష్టం చేసింది. ఇందులో ప్రత్యేక హోదా సహా చాలా అంశాలు ఎజెండాగా వున్నాయి.

ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం కేంద్రానికి లేదు. అయినా, రాష్ట్రం తరఫున అడగాల్సిందే కాబట్టి.. వైఎస్‌ జగన్‌, ప్రధాని మోడీని ప్రత్యేక హోదా అడిగే వుంటారు. ప్రధాని ఇస్తారా.? సమాధానం చెప్పకుండా వున్నారా.? అన్నది వేరే చర్చ. రాష్ట్రానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి, ప్రధానిని ఆహ్వానించడం అనేది శుభ పరిణామం. అదీ, అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపడుతున్న పేదలకు ఇళ్ళ నిర్మాణం – పట్టాల పంపిణీ కార్యక్రమం కోసం కావడంతో ప్రధాని సానుకూలంగా స్పందించే అవకాశాలెక్కువ.

పోలవరం ప్రాజెక్టు సహా అనేక కీలకమైన అంశాలూ చర్చకు వస్తాయి. అందులో 3 రాజధానులు, శాసన మండలి రద్దు కూడా వున్నాయి. ప్రధాని ఏం సమాధానమిచ్చారు.? అన్నది మళ్ళీ ఇంకో చర్చ. ఢిల్లీకి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి వినతులు ఇవ్వడాన్ని స్వాగతించాల్సిందే. అంతే తప్ప, మన ముఖ్యమంత్రి పరువుని మనమే బజారుకీడ్చేసుకుంటే.. అంతిమంగా పోయేది ఆంధ్రప్రదేశ్‌ పరువే. దురదృష్టవశాత్తూ ‘పచ్చ మీడియా’కి అవేమీ పట్టవంతే.

థ్యాంక్ గాడ్ ఆమెను పెళ్లి చేసుకోలేదు