తేడా నిర్ణయానికి అదే రేంజి రిటార్టు!!

 పరిపాలనను వికేంద్రీకరిస్తూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. అయితే…

 పరిపాలనను వికేంద్రీకరిస్తూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిక్యూటివ్ రాజధానిని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. అయితే ఈ నిర్ణయానికి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ… శాసనమండలిలో తమకున్న కొద్దిపాటి ఆధిక్యతను వాడుకొని కుట్ర చేసే ప్రయత్నంలో పడింది. ఫలితంగానే అధికార వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపాలని శాసనమండలి చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు.

 బిల్లుపై  మండలిలో చర్చ జరగకుండా దానిని సెలెక్ట్ కమిటీకి పంపడం అనేది చోద్యం. అయితే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు చాణక్య నీతిని  ప్రదర్శించారు.  చైర్మన్ పై ఒత్తిడి తెచ్చే  ఈ నిర్ణయం వెలువడేలా చేశారు.  154 అధికరణం కింద ఉన్న విచక్షణాధికారాలు ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతున్నాను అంటూ చైర్మన్ ప్రకటించారు.  ఇలాంటి నిర్ణయం సర్వత్రా విమర్శలకు గురైంది. నిబంధనలోని లొసుగులను వాడుకొనితప్పుడు నిర్ణయం చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి.

 అయితే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా తమ ప్రతి వ్యూహంలో అదే రేంజిలో జవాబిచ్చింది.  మరి కొన్ని నిబంధనలను వాడుకుంటూ అసలు సెలెక్ట్ కమిటీ ని ఏర్పాటు చేయకుండా ఉండేలాగా పావులు కదిపింది.  చైర్మన్ నిర్ణయాన్ని కాదని,  అసెంబ్లీ కార్యదర్శి,  సెలెక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదని ఫైలును తిప్పి పంపడం చర్చనీయాంశం అవుతోంది.

 సెలెక్ట్ కమిటీ ఏర్పాటుకు చైర్మన్ ఆదేశించిన తరువాత ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు.  విపక్ష పార్టీలు కమిటీ కోసం తమ తమ ప్రతినిధుల పేర్లను సూచించినప్పటికీ…  అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పేర్లు ఇవ్వలేదు.  అసలు ఆ ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించింది. ఈలోగా ఏకంగా మండలిని రద్దు చేసి పారేసింది.

ఇప్పుడు అసెంబ్లీ కార్యదర్శి కూడా చైర్మన్ ఆదేశాలను తిప్పికొట్టారు.  దీంతో సరికొత్త నిబంధనల పరమైన సంక్షోభం తలెత్తే అవకాశం కనిపిస్తోంది. సభా నిబంధన లో ఉండే కొన్ని లొసుగులను తెలుగుదేశం వాడుకొని ఒక ఎత్తువేస్తే,  మరి కొన్ని నిబంధనలను వైయస్సార్ కాంగ్రెస్ వాడుకుని  వారిని ఖంగుతిని పిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు.

లోకేష్ ప్రెండ్ పై ఐటీ దాడులు చేస్తే మీరెందుకు