ఇక అన్నీ ‘గిల్డ్’ లెక్కలే

సినిమా కలెక్షన్ల లెక్కలు ముదిరి ముదిరి, ఆఖరికి ఏవి నిజమో, ఏవి ఫేక్ అన్నది నిర్మాత కూడా తేల్చలేనంత దూరానికి వెళ్లిపోయాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతికి విడుదలయిన రెండు భారీ సినిమాలు సరిలేరు నీకెవ్వరు,…

సినిమా కలెక్షన్ల లెక్కలు ముదిరి ముదిరి, ఆఖరికి ఏవి నిజమో, ఏవి ఫేక్ అన్నది నిర్మాత కూడా తేల్చలేనంత దూరానికి వెళ్లిపోయాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతికి విడుదలయిన రెండు భారీ సినిమాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో . వీటి కలెక్షన్ల విషయంలో తలెత్తిన కంగాళీ, కన్ఫ్యూజన్ ఇంతా అంతా కాదు. ఆఖరికి నిర్మాతల మధ్య కూడా లోలోపల తకరారు బయల్దేరింది. మరోపక్క మహేష్ బాబు టీమ్ మీద మిగిలిన హీరోలు కాస్త కన్నెర్ర చేసే పరిస్థితి వచ్చింది.

ఇప్పుడు పరిస్థితి చక్కదిద్దడానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ రంగంలోకి దిగింది. ఇకపై ఏ నిర్మాత, హీరో ఫ్యాన్స్ ఎవ్వరూ ఎటువంటి కలెక్షన్ల ఫిగర్లు విడుదల చేయడానికి వీల్లేదు. కేవలం గిల్డ్ మాత్రమే కలెక్షన్లు ప్రకటిస్తుంది. అది కూడా షేర్ ప్రకటించదు. కేవలం గ్రాస్ మాత్రమే ప్రకటిస్తుంది.

ఈ మేరకు ఈ మధ్య జరిగిన గిల్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇకపై విడుదలయ్యే పెద్ద సినిమాలు అన్నింటికీ ఈ నిర్ణయం అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అంతా బాగానే వుంది. అంత మాత్రం చేత కచ్చితమైన అంకెలు బయటకు వస్తాయనుకుంటే భ్రమే. ఎందుకంటే హీరోలు తమకు కావాల్సిన వాళ్లకు డిస్ట్రిబ్యూషన్ ఇస్తున్నారు. అక్కడే ఫేక్ నెంబర్లు పుట్టడం ప్రారంభమవుతోంది. 

అలాగే గిల్డ్ ఎవరి చేతిలో వుంది. దిల్ రాజు లాంటి పెద్దల చేతిలో కదా? వీళ్లకూ హీరోల ప్రాపకం కావాలి కదా? అందువల్ల గిల్డ్ చెప్పే లెక్కలు పక్కా అని నమ్మేదేలా? కేవలం పూర్తిగా ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ వస్తే తప్ప, ఫేక్ ఫిగర్లు ఆగవేమో?

ఈ వేసవి లో పెళ్లి చేసుకోబోతున్న దిల్ రాజు