పవన్ కళ్యాణ్ ఓ అద్భుతమైన విషయం చెప్పేసారు. తాను సినిమాలు చేసేది సామాజిక సేవ కోసమే అని. హమ్మయ్య ఇప్పటికి క్లారిటీ వచ్చింది. యాభై కోట్ల రెమ్యూనిరేషన్, లాభాల్లో వాటా పవన్ ఏం చేసుకుంటారబ్బా…అనికునే వెర్రి జనం వున్నారు. వారికి ఇప్పుడు తెలిసి వచ్చింది తను సినిమాలు చేయడం సామాజిక సేవ అని చెప్పేసారు.
కానీ అదెలా అన్నదే ఇంకా చాలా మట్టి బుర్రలకు అర్థం కావడం లేదు. ఒక్కో సినిమాకు వచ్చిన రెమ్యూనిరేషన్ లో సగం అంటే పాతిక కోట్లకు పై ఒక్కో ఎంపీ నియోజక వర్గానికి అయిదేసి కోట్ల వంతున ఇచ్చుకుంటూ వెళ్తారేమో? అలా రాబోయే మూడేళ్లలో ప్రతి నియోజక వర్గానికి అయిదేసి కోట్ల వంతున అందిస్తారేమో? అన్న అనుమానాలు కలిగిన వారు వుంటారేమో?
చాలా మంది రాజకీయ నాయకులు ట్రస్ట్ లు పెట్టినట్లు సినిమాల వచ్చిన డబ్బు అటు మళ్లించి సేవా కార్యక్రమాలు చేస్తారేమో? ఆ విధంగా ట్రస్ట్ కు మరిన్ని విరాళాలు రాబట్టవచ్చు కూడా.
మొత్తం మీద సినిమాలు వదిలేసా రాజకీయాలే కీలకం అన్నది పవన్ కళ్యాణ్ నే
తనకు వేరే ఆదాయ మార్గాలు లేవు అందుకే సినిమాలు చేస్తున్నా మళ్లీ అన్నదీ ఆయనే.
ఇప్పుడు అసలు తను సినిమాలు చేస్తున్నదీ సామాజిక సేక కోసమే అంటున్నదీ పవన్ నే.
రేపో,. రాబొయే సినిమాల ఫంక్షన్ లలో ఏం అంటారో ఏమో చూడాలి.