బాబుగారూ.. గంజాయి దందాలో తమ వాటా ఎంత?

ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. లిక్కర్ ధరలు అమాంతం పెంచేశారని, గంజాయి స్మగ్లింగ్ విచ్చలవిడిగా జరుగుతున్నదని తెలుగుదేశం నాయకులు గొంతు చించుకుంటూ ఉంటారు. గురివింద గింజ తన వీపున ఉన్న నలుపు ఎరగదన్నట్లుగా…

ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. లిక్కర్ ధరలు అమాంతం పెంచేశారని, గంజాయి స్మగ్లింగ్ విచ్చలవిడిగా జరుగుతున్నదని తెలుగుదేశం నాయకులు గొంతు చించుకుంటూ ఉంటారు. గురివింద గింజ తన వీపున ఉన్న నలుపు ఎరగదన్నట్లుగా ఈ టీడీపీ నాయకుల మాటలు ధ్వనిస్తూ ఉంటాయి. 

గంజాయి సాగు, స్మగ్లింగ్ అనేది.. తెలుగుదేశం పాలన హయాంలోనే విచ్చలవిడిగా సాగుతూ ఉండిన దందా అనే సంగతి చాలా మందికి తెలుసు. అప్పటినుంచి కొనసాగుతున్న ఈ అక్రమ వ్యాపారానికి జగన్ సర్కారు గట్టిగా చెక్ పెడుతోంది గనుకనే.. కేసులు ఎక్కువగా బయటకు వస్తున్నాయి. 

అప్పట్లో తెలుగుదేశం పార్టీ తమ నాయకులతోనే స్మగ్లింగ్ చేయిస్తూ చూసీచూడనట్టుగా వ్యవహరించడం వల్లనే అప్పట్లో కేసులు కూడా నమోదు కాలేదు. అయితే ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా.. ఇప్పుడు టీడీపీ నాయకులు నమోదు అవుతున్న గంజాయి కేసుల గురించి జగన్ ప్రభుత్వానికి ముడిపెట్టాలని పాట్లు పడుతుంటారు.

అయితే.. గంజాయి దందా అనేది బాబు పాలన రోజుల్లోనే సమృద్ధిగా వర్ధిల్లినదని, ఆయన పార్టీ నాయకులే.. విచ్చలవిడిగా ఆ దందా సాగించారని.. పోలీసు కేసులు, అరెస్టులే నిదర్శనాలుగా ఇప్పుడు బయటకు వస్తోంది. హైదరాబాదు పోలీసులు ఏపీలోని నరసరావు పేటకు వెళ్లి జాహ్నవి అనే ఒక మహిళను అరెస్టు చేశారు. 

సదరు మహిళ 2013లో కారులో అరకు సమీపంలోని జి మాడుగుల నుంచి షిర్డికి 42 కిలోల గంజాయి తరలిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు గంజాయి స్మగ్లింగ్ ను పట్టుకున్న సమయంలో ఆమె పరారయ్యారు. కానీ.. కానూన్ కా హాథ్ బహుత్ లంబా హై అన్నట్లుగా.. తొమ్మిదేళ్ల తరువాత.. హైదరాబాదు పోలీసులు నరసరావు పేటకు వెళ్లి.. సదరు గంజాయి స్మగ్లరు జాహ్నవిని అరెస్టు చేసి తీసుకువచ్చారు. 

ఇదంతా నాణేనికి ఒకవైపు అన్నమాట. రెండోవైపున చూస్తే.. సదరు జాహ్నవిగారి పచ్చ కంపు బయటకు వస్తుంది. ఆమె నరసరావుపేటకు చెందిన తెలుగుదేశం మహిళావిభాగం కీలకనాయకురాలు. తెలుగుదేశం పచ్చకండువాలతో నాయకురాలి గెటప్ లో ఆమె దిగిన ఫోటోలు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. 

అంటే తాము 2014కు ముందునుంచి కూడా గంజాయి స్మగ్లింగ్ ఆరితేరిన వారిని, పోలీసు కేసుల్లో ఉన్నవారిని, పరారీలో బతుకుతున్న వారిని చంద్రబాబు చేరదీసి పార్టీ పదవులు అప్పగించి.. వారి అక్రమార్జనల ద్వారా పార్టీ మనుగడను కాపాడుకుంటున్నారని అర్థమవుతోంది. 

చంద్రబాబు ఏలుబడి సాగించిన తొలి అయిదేళ్లలో ఈ గంజాయి స్మగ్లర్ల మీద ఈగ వాలనివ్వకుండా ఆయనే చూసుకుని ఉంటారనే అభిప్రాయం కూడా ప్రజల్లో కలుగుతోంది. జగన్ సర్కారు దాడులు చేస్తున్నది గనుక.. కేసులు బయటకు వస్తున్నాయని.. చంద్రబాబు సర్కారు కళ్లు మూసుకుని గంజాయి సాగును, స్మగ్లింగును ప్రోత్సహించింది గనుకనే అప్పట్లో కేసులు కూడా బయటకు రాలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.