ఆర్ఆర్ఆర్ యుఎస్ @ 42 కోట్లు?

రాజమౌళి ఆర్ఆర్ఆర్ డొమస్టిక్ మార్కెట్ క్లోజ్ అయిపోయింది. ఓవర్ సీస్ కూడా ఎప్పుడో సింగిల్ పేమెంట్ 67 కోట్లకు అయిపోయింది.కానీ అలా తీసుకున్న ఫారస్ సంస్థ ఇఫ్పుడు దాన్ని ఏరియాల వారీగా అమ్మాలనుకుంటోంది. సహజంగానే…

రాజమౌళి ఆర్ఆర్ఆర్ డొమస్టిక్ మార్కెట్ క్లోజ్ అయిపోయింది. ఓవర్ సీస్ కూడా ఎప్పుడో సింగిల్ పేమెంట్ 67 కోట్లకు అయిపోయింది.కానీ అలా తీసుకున్న ఫారస్ సంస్థ ఇఫ్పుడు దాన్ని ఏరియాల వారీగా అమ్మాలనుకుంటోంది. సహజంగానే యుఎస్ హక్కుల కోసం పోటీ మొదలయింది. చిత్రంగా యుఎస్ లో మేజర్ ప్లేయర్ లు అయిన బ్లూ స్కయ్, గ్రేట్ఇండియా సంస్థలు దూరంగా వున్నాయి. వేరే సంస్థలు అనేకం పోటీ పడుతున్నాయి.

ఓన్లీ యుఎస్ 42 కోట్ల లోపులో ఇచ్చేది లేదని ఫారస్ సంస్థ పట్టుగా వున్నట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని భారీ సినిమాలు చేసి దెబ్బతిన్న ఓ సంస్థ 39 కోట్ల వరకు కోట్ చేసినట్లు తెలుస్తోంది. మరో సంస్థ అదర్ దాన్ గల్ఫ్ తీసుకోవడానికి 57 కోట్ల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. మరో సిండికేట్ ఓన్లీ యుఎస్ 40 వరకు వచ్చినట్లు వినికిడి.

42 వస్తేనే ఇవ్వాలనే ఆలోచనలో ఫారస్ సంస్థ వుంది. ఈ పోటీల కారణంగా ఆ రేటు కచ్చితంగా వస్తుందని ఆ సంస్థ భావిస్తోంది. అందుకోసమే వెయిట్ చేస్తోంది. బహుశా ఈ రోజు లేదా రేపు క్లోజ్ అయ్యే అవకాశం వుంది.

పెద్ద మనసు చాటుకున్న రామ్‌చరణ్‌