‘రాయిట‌ర్స్’ పేర్కొన్న ర‌హ‌స్య వ్య‌క్తి చంద్ర‌బాబేనా?

అనంత‌పురం జిల్లాలోని కియా కార్ల త‌యారీ ప‌రిశ్ర‌మ త‌ర‌లిపోతున్న‌ద‌ని ‘రాయిట‌ర్స్’ వార్తా సంస్థ రాసిన క‌థ‌నం తీవ్ర అల‌జ‌డి రేకెత్తించింద‌ని చెప్పొచ్చు. ఈ ప‌రిశ్ర‌మ‌పై ప్ర‌తిప‌క్ష టీడీపీ, జ‌న‌సేన‌, చంద్ర‌బాబుకు డ‌ప్పుకొట్టే ప‌త్రిక‌లు, చాన‌ళ్లు…

అనంత‌పురం జిల్లాలోని కియా కార్ల త‌యారీ ప‌రిశ్ర‌మ త‌ర‌లిపోతున్న‌ద‌ని ‘రాయిట‌ర్స్’ వార్తా సంస్థ రాసిన క‌థ‌నం తీవ్ర అల‌జ‌డి రేకెత్తించింద‌ని చెప్పొచ్చు. ఈ ప‌రిశ్ర‌మ‌పై ప్ర‌తిప‌క్ష టీడీపీ, జ‌న‌సేన‌, చంద్ర‌బాబుకు డ‌ప్పుకొట్టే ప‌త్రిక‌లు, చాన‌ళ్లు గ‌త నాలుగైదు రోజులుగా త‌లా ఒక ‘రాయి’ వేస్తున్నాయి. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు, ప‌త్రిక‌లు, చాన‌ళ్లు సృష్టిస్తున్న గంద‌రగోళం చూస్తుంటే…కియా త‌ర‌లిపోవాల‌నే ఆనందం వాళ్ల కళ్ల‌లో స్ప‌ష్టంగా క‌నిపించింది.

మ‌రోవైపు కియాపై త‌మ క‌థ‌నాన్ని రాయిట‌ర్స్ ఉప‌సంహ‌రించుకున్నా వీళ్లు మాత్రం వ‌దిలేలా లేరు. ‘ఉంటుందా?  వెళుతుందా?’ అంటూ ఆంధ్ర‌జ్యోతి రాసిన క‌థ‌నం చ‌దివితే…ఆశ్చ‌ర్య‌మేస్తుంది. గ‌త క‌థ‌నానికే క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని, స‌వ‌ర‌ణ చేశామంతే అని రాయిట‌ర్స్ పేర్కొన్న‌ట్టు ఆంధ్ర‌జ్యోతి రాసింది.  ఆంధ్ర‌జ్యోతిలో రాసిన‌ట్టు రాయిట‌ర్స్ క‌థ‌నంలో స‌వ‌ర‌ణ అంటే …‘ 1.1 బిలియన్‌ డాలర్ల వ్యయంతో నెలకొల్పిన ఇంత భారీ ప్లాంటును తరలించడం భారీ ఖర్చుతో కూడుకున్నదే. నష్టం కూడా భారీగానే ఉంటుంది. అందుకే తరలింపు ఖర్చు కూడా తమిళనాడు ప్రభుత్వం ఇస్తామంటోందని ఒక రహస్య వ్యక్తి తమకు చెప్పినట్లు రాయిటర్స్‌ పేర్కొంది’.

భారీ ఖ‌ర్చుతో కూడుకున్న ప్లాంట్‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తామ‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ఇస్తామంటోంద‌ని ‘ఒక ర‌హ‌స్య వ్య‌క్తి ’ త‌మ‌కు చెప్పిన‌ట్టు రాయిట‌ర్స్ పేర్కొంద‌ట‌. ఎక్క‌డైనా ఇది ఉంటుందా? త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం త‌ర‌పున అంత భారీ న‌ష్ట‌ప‌రిహారాన్ని మ‌న చంద్ర‌బాబునాయుడు ఇస్తున్నాడా? ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం నుంచి త‌క్ష‌ణం కియా ప‌రిశ్ర‌మ త‌ర‌లి పోవ‌డం ఒక్క చంద్ర‌బాబునాయుడు, ఆయ‌నకు సంబంధించి ఎల్లో మీడియా మాత్రమే కాంక్షిస్తోంది. అంత పెద్ద న‌ష్ట‌ప‌రిహారాన్ని ఒక వ్య‌క్తిగా చంద్ర‌బాబు మిన‌హా మ‌రెవ‌రికీ సాధ్యం అయ్యే ప‌నికాదు. మొత్తానికి కియా ప‌రిశ్ర‌మ పోవ‌డం సంగ‌తేమో కానీ, ఆ క‌థ‌నాన్ని ఆధారం చేసుకుని హ‌ల్‌చ‌ల్ చేసిన అన్ని మీడియా సంస్థ‌ల ప‌రువు మాత్రం పోయింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

పెద్ద మనసు చాటుకున్న రామ్‌చరణ్‌