మున్సిపల్ ఎన్నికల ముందు తనేదో గాంధేయవాదిని అని చెప్పుకుంటూ, మొసలి కన్నీరు కారుస్తూ సేవ్ తాడిపత్రి నినాదంతో గెలిచిన తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా తన అసలు స్వరూపాన్ని తనే బయటపెట్టుకున్నారు.
తాడిపత్రిలోని 35వ వార్డు పర్యటన భాగంగా ప్రజలు కాలనీలో రోడ్లు లేవని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో సమస్యలను చెప్పిన కాలనీ ప్రజలపై బూతులతో విరుచుకుపడ్డారు ప్రభాకర్ రెడ్డి.
@రేయ్..ఓటుకు 2 వేలు తీసుకుని ఇప్పుడు పనులు కావాలని అడుగుతారా నా…డకల్లారా అని బూతులు తిట్టారు. పక్కన అడవాళ్లు ఉన్నారు అని కూడా మరచి తన నోటికి వచ్చిన బూతులతో రెచ్చిపోయారాయన.
ఈ ఆవేశంలో ఒక విధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాను డబ్బులతో గెలిచాను అని చెప్పకనే చెప్పరు. తను పనులు చేయలంటే ప్రజలు తన డబ్బు తనకు వెనుక్కు ఇస్తేనే.. అన్నట్టుగా ఉంది ప్రభాకర్ రెడ్డి తీరు. ఒకటి మాత్రం నిజం చంద్రబాబు ఓడిన తర్వాత తప్పు చేశాను మారతాను మారతాను అని చెప్పి తాను గెలిచిన తరువాత ఎలా వ్యవహరిస్తారో ప్రభాకర్ రెడ్డి కూడా అంతే అయన మారరు, ఆయన నోటి తీరు మారదు.
గతంలో కూడా పలు సార్లు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టారీతిన పచ్చిబూతులు మాట్లాడుతూ వార్తల్లో నిలిచారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత కూడా తొలి సారి మళ్లీ అదే బూతు పంచాగంతో వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.