‘గ‌ల్లా నీ త‌ల‌పై జుట్టే కాదు, త‌ల్లో బుర్ర కూడా లేదు!’

తెలుగుదేశం ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. కియా అంశంపై తెలుగుదేశం ప్ర‌చారం గురించి మిథున్ రెడ్డి ట్విట‌ర్ లో ఘాటుగా స్పందించారు. కియా త‌ర‌లిపోతోందంటూ…

తెలుగుదేశం ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. కియా అంశంపై తెలుగుదేశం ప్ర‌చారం గురించి మిథున్ రెడ్డి ట్విట‌ర్ లో ఘాటుగా స్పందించారు. కియా త‌ర‌లిపోతోందంటూ గ‌ల్లా జ‌య‌దేవ్ లోక్ స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌ల‌పై మిథున్ రెడ్డి ట్విట‌ర్లో కౌంట‌ర్ ఇచ్చారు. గ‌ల్లా జ‌య‌దేవ్ ప్ర‌సంగాన్ని ట్వీట్ చేస్తూ.. ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు మిథున్ రెడ్డి.

'నీ త‌ల‌పై జుట్టే కాదు, ఆ త‌ల‌లో బ్రెయిన్ కూడా లేద‌ని ఇప్పుడు అర్థం అవుతూ ఉంది. ఏపీ నుంచి పెట్టుబ‌డుల‌ను త‌రిమివేయ‌డానికి ఎందుకంత తొంద‌ర? ఎంపీ హోదాలో ఉండి అస‌త్యాల‌ను ప్ర‌చారం చేస్తావా? అయినా నీ నుంచి ఇంత క‌న్నా ఏం ఆశించ‌గ‌లం?' అని మిథున్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కియా కంపెనీకి త‌ర‌లివెళ్లే ఆలోచ‌న ఏమీ లేక‌పోయినా, తెలుగుదేశం పార్టీ దుష్ప్ర‌చారానికి పాల్పడుతూ ఉండ‌టాన్ని ఈ విధంగా త‌ప్పు ప‌ట్టారు మిథున్ రెడ్డి.

గ‌ల్లా జ‌య‌దేవ్ ఒక బాధ్య‌తారాహిత్య‌మైన వ్య‌క్తి, అజ్ఞాని అని మిథున్ రెడ్డి అభివ‌ర్ణించారు. కియా ఎండీ ప్ర‌క‌ట‌న‌ను జ‌త చేస్తూ మ‌రో ట్వీట్ చేశారు. తెలుగుదేశం పార్టీ దుష్ప్ర‌చారాన్ని మిథున్ రెడ్డి ఇలా ఖండించారు.

నాకు ఆ అలవాటు లేదు