జాను దిల్ రాజుకు జాక్ పాట్ నే

ఈవారం విడుదలయిన సినిమా జాను, తమిళ సినిమా 96 కు రీమేక్ కావడం, అలాగే సమంత-శర్వానంద్ లీడ్ పెయిర్ కావడంతో ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది. అయితే క్లాసిక్ సినిమా కావడంతో తెలుగు నాట…

ఈవారం విడుదలయిన సినిమా జాను, తమిళ సినిమా 96 కు రీమేక్ కావడం, అలాగే సమంత-శర్వానంద్ లీడ్ పెయిర్ కావడంతో ఈ సినిమా మీద ఆసక్తి పెరిగింది. అయితే క్లాసిక్ సినిమా కావడంతో తెలుగు నాట బిజినెస్ ఎలా వుంటుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద క్లారిటీ లేదు.

ఇదే మరో నిర్మాత అయితే జాను సినిమాకు అన్నీ సమస్యలే అయి వుండేవి. అసలు ప్రాజెక్టు ఈ రేంజ్ లో సాధ్యం అయ్యేది కాదు. దిల్ రాజు కాబట్టి సమంత ను, శర్వానంద్ ను ప్రాజెక్టులోకి తీసుకురాగలిగారు. అంతే కాదు. నాన్ థియేటర్ రైట్స్ అన్నీ ఒకేసారి మార్కెట్ చేసుకోగలిగారు. ఇప్పుడు పాజిటివ్ రివ్యూలు కూడా వచ్చేసాయి. మౌత్ టాక్ స్ప్రెడ్ అయితే కలెక్షన్లు మరింతగా వుంటాయనే నమ్మకం వుంది.

ఈ సినిమా నిర్మాత దిల్ రాజు-శిరీష్ లకు జాక్ పాట్ నే. ఎందుకంటే సినిమాకు గట్టిగా 20 కోట్లకు మించి ఖర్చు కాలేదు. సినిమా రీమేక్ రైట్స్ కు కొటి ఎనభై లక్షలు ఖర్చయింది. దర్శకుడికి కోటి ఇరవై లక్షలు ఇచ్చారు. శర్వా మూడున్నర కోట్లు, సమంత కోటిన్నర దాకా ఇచ్చారు.

సినిమాకు తమిళ యూనిట్ నే దాదాపు పని చేసింది. స్క్రిప్ట్ ను ముందుగా చకచకా రెడీ చేయించి, ప్లాన్డ్ గా షెడ్యూళ్లు వేసి, ఫినిష్ చేయడంతో రీజనబుల్ బడ్జెట్ లోనే సినిమా ఫినిష్ అయింది. ఎమోషనల్ సీన్లు కాబట్టి కాస్త వర్కింగ్ డేస్ పెరిగాయి. విదేశీ ఎపిసోడ్ కు కోటి రూపాయల వరకు ఖర్చు చేసారు. 

సినిమాకు నాన్ థియేటర్ రైట్స్ మీద 14 కోట్ల వరకు వచ్చింది. డిజిటల్ అమెజాన్ కు, శాటిలైట్ మా టీవీకి ఇచ్చేసారు. దిల్ రాజు టోటల్ గా మ్యాంగో సంస్థ కు ఇచ్చేయగా, వాళ్లు రీసేల్ చేసుకున్నారు. ఇది కాక ఆంధ్ర 8 కోట్ల అడ్వాన్స్ ల మీద డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చారు. నైజాం అయిదు కోట్లు అక్కౌంట్ లో రాసుకున్నారు. సీడెడ్ నామినల్ ప్రయిస్ కు ఎన్వీ ప్రసాద్ కు డిస్ట్రిబ్యూషన్ కు ఇచ్చారు. ఓవర్ సీస్ రెండు కోట్లకు అమ్మేసారు. ఆ విధంగా థియేటర్ మీద 16 కోట్ల వరకు వచ్చాయి. నాన్ థియేటర్ 14 కోట్ల వరకు వచ్చాయి.

అడ్వాన్స్ ల మేరకు సినిమా ఆడేస్తే సినిమాకు దాదాపు 10 కోట్ల లాభం వుంటుంది.