ఇప్పుడు చెప్పండి ‘అల’ ‘సరిలేరు’ లెక్కలు

కేవలం తమకు సంబంధం లేదు ఫ్యాన్స్ వేసుకున్నారు ట్విట్టర్ లో లేదా ఫ్యాన్స్ కోసం ఫిగర్లు ప్రచురిస్తున్నాం అని నిర్మాతలు చెప్పే మాటలు ఇక ఎంత కాలమో చెల్లకపోవచ్చు. మా హీరో సినిమా ఇంత…

కేవలం తమకు సంబంధం లేదు ఫ్యాన్స్ వేసుకున్నారు ట్విట్టర్ లో లేదా ఫ్యాన్స్ కోసం ఫిగర్లు ప్రచురిస్తున్నాం అని నిర్మాతలు చెప్పే మాటలు ఇక ఎంత కాలమో చెల్లకపోవచ్చు. మా హీరో సినిమా ఇంత కలెక్షన్లు వసూలు చేసింది, మా హీరో సినిమా ఇంత కలెక్షన్లు వసూలు చేసింది అని చెప్పడం చిరకాలంగా ఇండస్ఠ్రీలో అలవాటైపోయింది. ఇది ఎంత వరకు వెళ్లిందంటే, హీరోలు తనకు కావాల్సిన వారికే డిస్ట్రిబ్యూషన్లు ఇప్పించి, వారి చేత కూడా ఫేక్ ఫిగర్లు చెప్పించేంత వరకు.

కానీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి. ఆదాయపన్ను శాఖ ఈ ఫిగర్లు అన్నీ సేకరిస్తోంది ప్రెస్ మీట్లలో చేస్తున్న ప్రసంగాలు అన్నీ రికార్డులుగా దగ్గర పెట్టుకుంటోంది. మీడియాలో వచ్చిన వార్తల కటింగ్ లు తీసుకుంటోంది. ఇవన్నీ పట్టుకుని, సరైన టైమ్ లో నిర్మాతల మీద దాడులు చేసి, వీటి ఆధారంగా ప్రశ్నలు కురిపిస్తారు.

నిన్నటికి నిన్న తమిళనాడులో జరిగిన దాడుల్లో కూడా ఈ తరహా వ్యవహారం చోటు చేసుకుందని తెలుస్తోంది. వివిధ మాధ్యమాల్లో వచ్చిన వార్తలను ఐటి శాఖ సేకరించి, నిర్మాతలను, హీరోలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో కూడా ఇటీవల ఐటి అధికారులు నిర్మాతల మీద దాడి చేసినపుడు ఈ విధమైన ప్రశ్నలు ఎదురయినట్లు తెలుస్తోంది.

పండగ సినిమాలుగా వచ్చిన అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల కలెక్షన్ల వివాదం మీద, కలెక్షన్ల ఫిగర్ల మీద, వందలాది కోట్ల కలెక్షన్ల మీద ఆదాయశాఖ కన్నేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో హీరోల మెహర్బానీకి పోయి అక్కర్లేని ఫిగర్లు సర్క్యులేట్ చేస్తే ఇబ్బందిలో పడేది నిర్మాతలే.

నందు పెర్ఫార్మన్స్ ఇరగతీసాడు