పేపర్ బాయ్ ముందుకు వస్తున్నాడు

అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినపుడు వాడేసుకోవాలంతే. పేపర్ బాయ్ ఇప్పుడు అదే చేసేటట్లు కనిపిస్తున్నాడు. సంపత్ నంది డైరక్షన్ లో తయారైన సినిమా పేపర్ బాయ్. ఇటీవలే టీజర్ వచ్చి అందరి దృష్టిని…

అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినపుడు వాడేసుకోవాలంతే. పేపర్ బాయ్ ఇప్పుడు అదే చేసేటట్లు కనిపిస్తున్నాడు. సంపత్ నంది డైరక్షన్ లో తయారైన సినిమా పేపర్ బాయ్. ఇటీవలే టీజర్ వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా విడుదల వాస్తవానికి సెప్టెంబర్ 7న అనుకున్నారు. కానీ అక్కడ విపరీతమైన పోటీ వచ్చిపడింది.

అల్లరి నరేష్-సునీల్ ల సిల్లీ ఫెలోస్, నిర్వాణ ఫిలింస్ మను, మరో చిన్న సినిమా అదేరోజు విడుదలకు షెడ్యూలు అయ్యాయి. ఈ మూడింటితో పేపర్ బాయ్ రావాల్సివుంది. ఇలాంటి టైమ్ లో మారుతి-నాగచైతన్యల శైలజారెడ్డి అల్లుడు సినిమా వాయిదా పడుతున్నట్లు వార్తలు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా అయితే సెప్టెంబర్ 6 లేదా 14కు వెళ్లేలా వుంది. ఆ స్లాట్ ఖాళీ. దానికోసం వుంచిన థియేటర్లు ఖాళీ.

అందుకే ఆ స్లాట్ లోకి వచ్చేయాలని చూస్తున్నాడు పేపర్ బాయ్. ఎలాగూ ముందురోజు నర్తనశాల అయిపోతుంది. మర్నాడు సోలోగా బరిలోకి దిగవచ్చు. ఫస్ట్ కాపీ ఎలాగూ రెడీగా వుంది. పబ్లిసిటీ ప్లాన్ చేసుకోగలిగితే చాలు. ఓ మాంచి ఫ్రీరిలీజ్ ఫంక్షన్ కాస్త భారీగా చేస్తే సరిపోతుంది. ప్రస్తుతానికి బయ్యర్లతో డిస్కషన్లు సాగుతున్నాయి. అవి ఫైనల్ అయితే పేపర్ బాయ్ డేట్ ఫైనల్ అయిపోతుంది.