కేరళలో మారుతికి ‘అల్లుడు’ బాధలు

డైరక్టర్ మారుతి కేరళలో ఇరుక్కున్నారు. ఆయన తన శైలజారెడ్డి అల్లుడు సినిమా రీరికార్డింగ్ కోసం కోచ్చి వెళ్లారు. వాస్తవానికి కాస్త ముందుగానే వెళ్లాలి కానీ, గీత గోవిందం సినిమా ఆర్ ఆర్ లేట్ కావడంతో…

డైరక్టర్ మారుతి కేరళలో ఇరుక్కున్నారు. ఆయన తన శైలజారెడ్డి అల్లుడు సినిమా రీరికార్డింగ్ కోసం కోచ్చి వెళ్లారు. వాస్తవానికి కాస్త ముందుగానే వెళ్లాలి కానీ, గీత గోవిందం సినిమా ఆర్ ఆర్ లేట్ కావడంతో మారుతి  లేటుగా వెళ్లారు. మొదట మూడురోజులు బాగానే వుంది. ఆరు రీళ్ల వరకు ఆర్ ఆర్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది  బాధ.

వర్షాలే వర్షాలు. వరదలు. మారుతి దిగిన స్టార్ హోటల్ జనరేటర్ ఏరియాలోకి కూడా వరదనీళ్లు వచ్చి చేరాయి. కరెంట్ లేదు. ఏది దొరికితే అదే తిండి. పోనీ అలాగే వర్క్ చేయించాలి అని పంతంగా కూర్చుంటే, అక్కడికి సమీపంలోనే గోపీ సుందర్ ఇంటికీ అవే బాధలు.

కరెంట్ లేదు. వాళ్ల బంధువులు అంతా వేరే వేరే ప్రంతాల్లో వరదల్లో ఇరుక్కుపోయారు. దాంతో వాళ్ల కోసం ఏదో ఒకటి చేయాల్సి రావడం. మొత్తంమీద అలాగే మరో మూడు నాలుగు రీళ్లు కంప్లీట్ చేసారు.

ఇక ఇప్పుడు ఇంకో ఆరు రీళ్ల పని బకాయి వుందని తెలుస్తోంది. కానీ చేయడానికి పరిస్థితులు మాత్రంలేవు. గోపీసుందర్ ను హైదరాబాద్ రప్పించేద్దాం అంటే అక్కడ అతని వ్యక్తిగత సమస్యలు. పోనీ ఇక్కడ ఎవరితోనైనా ఆర్ ఆర్ చేయించేద్దామన్న ఆలోచన మరోపక్క.

మొత్తంమీద శైలజా రెడ్డి అల్లుడు ఆర్ ఆర్ ఆరు రీళ్ల దూరంలో ఆగింది. మారుతి కోచ్చీలో స్టక్ అయ్యారు. అక్కడి విమానాశ్రయం మూసేసారు. కోచ్చి నుంచి త్రివేండ్రమ్ రోడ్ వే ఇవ్వాళో రేపో ఓపెన్ చేస్తారు. అప్పుడు అక్కడికి వచ్చి, అక్కడి నుంచి ఇక్కడకు రావాలి. మరి ఆర్ ఆర్ ఏం చేస్తారో? సినిమా విడుదల ఏమవుతుందో చూడాలి.