కాంప్రమైజ్ అవుతావా అని అడిగారు

బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనిపించుకుంది పాయల్ రాజ్ పుత్ తన తొలి సినిమా ఆర్ ఎక్స్ 100తో. ఇప్పుడు అంతకన్నా బోల్డ్ గా మాట్లాడేసింది. ఓ సినిమా చేయకముందు కాదు, చేసిన తరువాత కూడా…

బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అనిపించుకుంది పాయల్ రాజ్ పుత్ తన తొలి సినిమా ఆర్ ఎక్స్ 100తో. ఇప్పుడు అంతకన్నా బోల్డ్ గా మాట్లాడేసింది. ఓ సినిమా చేయకముందు కాదు, చేసిన తరువాత కూడా ‘కాంప్రమైజ్’ అవుతావా? అని అడుగుతున్నారు అంటూ ఖస్సమంది. అసలు ఎలా కనిపిస్తున్నాను.. ఎవరికి పడితే వారికి ముద్దుల పెట్టుకుంటూ పోయేలా కనిపిస్తున్నానా అని నిలదీసి అడిగేసింది.

కాస్టింగ్ కౌచ్ గురించి ఓ ఇంటర్వూలో అడిగితే ఇలా కడిగిపారేసింది పాయల్. తనకు తన టాలెంట్ మీద నమ్మకం వుందని, మంచిపాత్ర అయితే ఎలా అయినా చేస్తానని, అలా అని చెప్పి, సినిమా బయట కూడా ఇష్టం వచ్చినట్లు వుంటాననుకొవద్దు అని క్లారిటీ ఇచ్చేసింది.

మూడురోజుల ముందు కూడా కాంప్రమైజ్ అవుతారా? అంటూ ప్రపోజల్ వచ్చిందని పాయల్ వెల్లడించింది. శ్రీరెడ్డి ఉదంతం తరువాత కూడా టాలీవుడ్ ఏమీ మారలేదని, డైరక్ట్ గా కాంప్రమైజ్ అవుతారా? అని అడిగి మరీ సినిమాల్లో బుక్ చేస్తున్నారని, పాయల్ మాట ద్వారా అర్థం అవుతోంది. టాలీవుడ్ జనాలకు అస్సలు సిగ్గు, భయం లేవని పాయల్ మాటలు మరోసారి రుజువు చేస్తున్నాయి.