రాశీఖన్నా కోటికి ఆశపడితే..

నటీనటులు ఎవరికైనా సరే, అన్నిసార్లూ రెమ్యూనిరేషన్ కీలకంకాదు. అందునా హీరోయిన్లకు అయితే ఈ పాయింట్ మరీ అవసరం. ఎందుకంటే హీరోయిన్లకు సరైన పాత్రలు పడడం అరుదు. ఎంతసేపూ రొటీన్ పాత్రలే. ఏ హీరోయిన్ కు…

నటీనటులు ఎవరికైనా సరే, అన్నిసార్లూ రెమ్యూనిరేషన్ కీలకంకాదు. అందునా హీరోయిన్లకు అయితే ఈ పాయింట్ మరీ అవసరం. ఎందుకంటే హీరోయిన్లకు సరైన పాత్రలు పడడం అరుదు. ఎంతసేపూ రొటీన్ పాత్రలే. ఏ హీరోయిన్ కు అయినా సూట్ అయ్యేవే. అందువల్ల సరైనపాత్ర దొరికితే, రెమ్యూనిరేషన్ కాస్త అటు ఇటు అయినా ఓకె అనేయడం బెటర్. లేదూ అంటే మంచిపాత్రలు మిస్ అయిపోతాయి.

రాశీఖన్నా విషయంలో ఇలాగే జరిగింది. గీతగోవిందం సినిమాకు హీరోయిన్ గా ముందు లావణ్య త్రిపాఠీని అనుకున్నారు. కానీ ఆమె కెరీర్ ట్రాక్ రికార్డు అంత బాగా లేకపోవడం, విజయ్ దేవరకొండ పక్కన ఎలా వుంటుందో అన్న సందేహంతో డ్రాప్ అయ్యారు. రాశీఖన్నాను అప్రోచ్ అయ్యారు. ఆమె ఓకె అన్నది. కానీ రెమ్యూనిరేషన్ కోటి రూపాయలు తగ్గేది లేదని చెప్పినట్లు వినికిడి.

ఈ విషయంలో కాస్త మల్లగుల్లాలు నడిచాయని వినికిడి. కానీ రాశీఖన్నా తగ్గకపోవడం, అదే సమయంలో రష్మిక మడొన్నా ఆప్షన్ గా దొరకడంతో ఆమెను ఫిక్స్ చేసుకున్నారు. చిత్రమేమిటంటే, రాశీఖన్నా అత్యంత మంచి సినిమా, మంచి పాత్ర అవుతుందనుకున్న శ్రీనివాసకళ్యాణం కూడా ఇప్పుడే విడుదలయింది. కానీ ఫలితం వేరుగా వుంది. వదిలేసుకున్న గీతగోవిందం గూడా ఇప్పుడే విడుదలయింది. దాని ఫలితం వేరుగా వుంది. దట్సిట్.