మహేష్ సినిమాకు రిషి అన్న టైటిల్ పెడతారేమో అన్న వ్యవహారం సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తోంది. కానీ ఇదే టైమ్ లో ఫ్యాన్స్ రెండు అక్షరాల టైటిల్ నా.. అమ్మో అని లోలోపల మధనపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేష్ కు రెండు అక్షరాల టైటిళ్లు ఇప్పటి వరకు సక్సెస్ ను ఇవ్వలేదని పాత లెక్కలు తవ్వుతున్నారు.
మహేష్ కెరీర్ లో పరమ డిజాస్టర్లు అయిన బాబీ, నానీ, వంశీ, నిజం సినిమాలు అన్నీ రెండు అక్షరాల టైటిళ్లే. వాస్తవానికి మహేష్ కు మూడు అక్షరాల టైటిల్ సినిమాలు కూడా ఎక్కువే. వీటిలో సగం ఫ్లాపులు వున్నాయి. సగం హిట్ లు వున్నాయి. స్పైడర్, ఆగడు, ఖలేజా ఇలాంటివే. కానీ ఎక్కువ హిట్ లు ఇచ్చినవి మూడు అక్షరాల టైటిళ్లే. ఒక్కడు, దూకుడు, పోకిరి ఇలా.
సో, మొత్తంమీద రెండు అక్షరాల టైటిల్ అంటే మాత్రం అభిమానులు అంతగా ఇష్టపడడం లేదన్నది వాస్తవం. అందుకే క్యారెక్టర్ పేరు రిషి అని వుంచేసి, సినిమాకు వేరే పేరు వెదికే పనిలో వున్నారు డైరక్టర్ వంశీ పైడిపల్లి. టైటిల్ దొరికితే అది, లేదూ అంటే కేవలం క్యారెక్టర్ పేరు మహేష్ బర్త్ డేకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు ప్రస్తుతానికి.