క్రేజ్ లేకపోతే రెమ్యూనరేషన్ కూడా ఇవ్వరా..?

హీరోయిన్ల నవ్వు, ఆ గ్లామర్ పైపైన చూడ్డానికి మాత్రమే. హీరోయిన్ల అందరి జీవితాలు మనం అనుకున్నంత సుఖంగా ఉండవు. పైకి ఆల్ ఈజ్ వెల్ అన్నట్టు కనిపించినా లోపల సినిమా కష్టాలే. తాజాగా ఇలాంటిదే…

హీరోయిన్ల నవ్వు, ఆ గ్లామర్ పైపైన చూడ్డానికి మాత్రమే. హీరోయిన్ల అందరి జీవితాలు మనం అనుకున్నంత సుఖంగా ఉండవు. పైకి ఆల్ ఈజ్ వెల్ అన్నట్టు కనిపించినా లోపల సినిమా కష్టాలే. తాజాగా ఇలాంటిదే మరో హీరోయిన్ ఉదంతం బయటపడింది.

ఓ సూపర్ హిట్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిందా హీరోయిన్. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఆ సినిమాతో ఎన్నో అవార్డులు అందుకుంది. తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది కానీ అనుకున్న స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం కేవలం అవార్డు ఫంక్షన్లు, స్టేజ్ షోలకు మాత్రమే పరిమితమైన ఆ  బ్యూటీ.. ఎట్టకేలకు మరో తెలుగు సినిమా ఛాన్స్ అందుకుంది.

అయితే తెలుగులో మరో అవకాశమైతే వచ్చింది కానీ ఆమెకు ఆశించిన స్థాయిలో రెమ్యూనరేషన్ మాత్రం అందలేదు. కేవలం ప్రయాణ ఖర్చుల కోసం 5 లక్షలిచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ మేరకు తెరవెనక ఓ ప్రొడ్యూసర్ ఆమెకు డబ్బు అందకుండా చేశాడు. తనకు అవకాశం ఇవ్వడమే ఎక్కువని, డబ్బు ఇవ్వక్కర్లేదని తనవాళ్ల దగ్గర గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆ నిర్మాత.

బాధాకరమైన విషయం ఏంటంటే.. ఆ సినిమాలో ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా నటిస్తోంది. ఆమెకు కాస్త స్టార్ వాల్యూ ఉంది. ఆమెకు మాత్రం దాదాపు కోటి రూపాయలు సమర్పించుకున్నారు. నిజానికి ఈ హీరోయిన్ తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ అందలేదంటూ రిలీజ్ కు ముందు ఫిలింఛాంబర్ లో ఫిర్యాదు చేయొచ్చు. కానీ అలా చేస్తే ఉన్న అవకాశాలు కూడా రావని భయపడుతోందామె. అందుకే తన బాధను ఎవరితో చెప్పుకోలేక సతమతమౌతోంది.