పూజాహెగ్డేకు యూవీ ఫొటోషూట్

పూజాహెగ్డే టాలీవుడ్ టాప్ సీడ్ గా చెప్పుకోవాలి ఇప్పుడు. వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ వస్తోంది ఈ అందగత్తె. అన్నింటికన్నా చెప్పుకోదగిన మూవీ ప్రభాస్ తో  చేయబోతోంది. రాధాకృష్ణ డైరక్షన్ లో ప్రభాస్ హీరోగా…

పూజాహెగ్డే టాలీవుడ్ టాప్ సీడ్ గా చెప్పుకోవాలి ఇప్పుడు. వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ వస్తోంది ఈ అందగత్తె. అన్నింటికన్నా చెప్పుకోదగిన మూవీ ప్రభాస్ తో  చేయబోతోంది. రాధాకృష్ణ డైరక్షన్ లో ప్రభాస్ హీరోగా స్టార్ట్ కాబోయే మూవీలో ఆమె ఓ డిఫరెంట్ రోల్ ప్లే చేయబోతోంది.

అందుకే ఈ రోల్ లో ఎలావుంటుంది? ఫిట్ అవుతుందా? కాదా? అలాగే ప్రభాస్ సరసన ఎలా వుంటుంది?  అనేవి క్లారిటీగా తెలుసుకోవడం కోసం ఈరోజు ఫొటోషూట్ చేసారట. పనిలో పనిగా వీడియో షూట్ కూడా చేసినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి పూజాహెగ్డే అందంగానే వుంటుంది. కానీ ఈ మధ్య మరీ ఓవర్ డైటింగ్ చేయడంతో మొహం కూడా కాస్త పీక్కుపోయినట్లు తయారయింది. సాక్ష్యం సినిమాలో ఆ తేడా క్లియర్ గా కనిపించింది. అందుకే ఓసారి ఫొటోషూట్, వీడియో షూట్ చేయాలని ప్లాన్ చేసారు. ఆ కార్యక్రమం సోమవారం నాడు విజయవంతంగా పూర్తిచేసారు.

ప్రస్తుతం యూవీ సంస్థ సాహో సినిమాను ప్రభాస్ హీరోగా 300కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఆ సినిమా సగానికి పైగా పూర్తయ్యాక రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా స్టార్ట్ చేస్తారు. దీనికి మరికొంచెం టైమ్ వుంది. ఈ సినిమాలో ప్రభాస్ అస్ట్రాలజర్ గా కనిపించబోతున్నసంగతి తెలిసిందే.