ఆ దర్శకుడికి ‘ఎఫ్‌ఎం’ కలిసిస్తోందా?

సిటీ నాగరికతలోకి గత దశాబ్దం, దశాబ్దంన్నర కాలంలో బాగా మిళితం అయిపోయింది ఎఫ్‌ఎం రేడియో. సెల్‌ఫోన్‌ పూర్తి స్థాయిలో డ్యామినేషన్‌ చేయడం మొదలయ్యాకా ఎఫ్‌ఎం హవా కొంత తగ్గినది అయితే వాస్తవం కానీ.. కొన్నేళ్ల…

సిటీ నాగరికతలోకి గత దశాబ్దం, దశాబ్దంన్నర కాలంలో బాగా మిళితం అయిపోయింది ఎఫ్‌ఎం రేడియో. సెల్‌ఫోన్‌ పూర్తి స్థాయిలో డ్యామినేషన్‌ చేయడం మొదలయ్యాకా ఎఫ్‌ఎం హవా కొంత తగ్గినది అయితే వాస్తవం కానీ.. కొన్నేళ్ల కిందట వరకూ ఎఫ్‌ఎం జనాలను ఒక ఊపు ఊపింది. ఎఫ్‌ఎం బాగా పుంజుకోవడానికి కారణం కూడా సెల్‌ఫోనే. ఫోన్‌ కేవలం కాల్స్‌ కోసమే కాదు, కాస్త వినోదం కూడా ఉంటుందని దశాబ్దకాలం కిందట మొబైల్స్‌లో ఎఫ్‌ఎంను మిళితం చేశారు. మొబైల్లో ఎఫ్‌ఎం ప్లేకావడం అప్పట్లో జనాలకు పిచ్చెక్కించింది. దీంతో ఎఫ్‌ఎం శ్రోతల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది.

అయితే ఫోన్లో ఎఫ్‌ఎం మాత్రమే కాకుండా.. వీడియో, ఆడియో ప్లే, మెమొరీ కార్డ్స్‌ మొబైల్స్‌ జనాలకు బాగా ఎప్పుడు రీచ్‌ అయ్యాయో అక్కడ నుంచి ఎఫ్‌ఎంపై జనాల ఆసక్తి తగ్గుముఖం పట్టింది. ఎఫ్‌ఎంలో వాళ్లువేసే పాటల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, కావాల్సిన పాటలను ప్లే చేసేసుకునే అవకాశం రావడం, ఇంతలోనే మొబైల్లో ఇంటర్నెట్‌ స్ట్రీమింగ్‌ ఎక్కువ కావడంతో ఎఫ్‌ఎం రేడియాలపై ఆసక్తి బాగా తగ్గిపోయింది. అయితే ఇప్పుడు కూడా కార్లలో.. క్యాబ్స్‌లో.. కొంతమంది మైబైల్స్‌ ద్వారా.. ఎఫ్‌ఎం వింటూనే ఉన్నారు. ఇలాంటి ఎఫ్‌ఎం ఏనాడో సినిమాల్లో కూడా మెరిసింది.

హీరోయిన్‌ని రేడియో జాకీగా చూపించడం, సినిమాల్లో ఏదో ఒకపాత్ర ఈ పనిచేస్తూ ఉండటం చాలా సినిమాల్లో చూశాం. ఇలా సినిమా కథను చాలావరకూ ఎఫ్‌ఎం ద్వారా నడిపించేసిన దర్శకుడు మాత్రం రాజ్‌కుమార్‌ హీరానీ మాత్రమే. 'లగేరహో మున్నాభాయ్‌' సినిమాను మొత్తంగా ఎఫ్‌ఎం ద్వారా నడిపించేశాడు ఈ దర్శకుడు. పుష్కరకాలం కిందట వచ్చిన ఆ సినిమాలో ఎఫ్‌ఎం రేడియో ద్వారా కథను నడిపించేసి ఆకట్టుకున్న ఈ దర్శకుటు ఇటీవలి 'సంజూ'లో కూడా ఎఫ్‌ఎం సెంటిమెంట్‌ను వాడేసుకున్నాడు.

ఇప్పుడు ఎఫ్‌ఎంలు జనాలకు అంత చేరువలో లేవు కదా, అందుకే.. జైల్‌ ఎఫ్‌ఎంతో కథ నడిపించాడు. జైల్లో హీరో ఖైదీల కోసం ఒక ఎఫ్‌ఎం నడుపుతున్నట్టుగా.. వారిని ఎంటర్‌టైన్‌ చేస్తున్నట్టుగా.. కథను నడిపించాడు హిరానీ. సంజూ బయోపిక్‌లో కూడా ఈ విధంగా ఎఫ్‌ఎం సెంటిమెంట్‌ను మిస్‌ కానీయకుండా రాజ్‌కుమార్‌ హీరోనీ దానిపై తన మమకారాన్ని చాటుకున్నాడు.