మహేష్ మళ్లీ ఫ్యామిలీ సినిమా

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటూ ఓ మాంచి ఫ్యామిలీ సినిమా చేసాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ సినిమా సాధించిన విజయంతో అదే డైరక్టర్ తో బ్రహ్మోత్సవం సినిమా చేసాడు. అదికూడా…

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అంటూ ఓ మాంచి ఫ్యామిలీ సినిమా చేసాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ సినిమా సాధించిన విజయంతో అదే డైరక్టర్ తో బ్రహ్మోత్సవం సినిమా చేసాడు. అదికూడా పక్కా ఫ్యామిలీ జోనర్ నే. కానీ ఫలితం వికటించింది. దాని తరువాత వేరే జోనర్ లు ట్రయ్ చేసుకుంటూ వస్తున్నాడు. 

అయితే ఇప్పుడు మరోసారి ఫ్యామిలీ జోనర్ ను ట్రయ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్యూర్ ఫ్యామిలీ జోనర్ కాదు. లవ్ అండ్ ఫ్యామిలీ జోనర్ అన్నమాట. ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా చేస్తున్న మహేష్ బాబు తరువాత సినిమాను సుకుమార్ డైరక్షన్ లో చేయబోతున్నాడు. ఈ సినిమాను మైత్రీమూవీస్ నిర్మిస్తుంది.

రంగస్థలం సినిమాలో హ్యూమన్ ఎమోషన్లకు పెద్దపీట వేసిన సుకుమార్ మరోసారి అలాగే ఫ్యామిలీ ప్లస్ లవ్ ఎమోషన్లు కలిపి తయారుచేసిన సబ్జెక్ట్ ను మహేష్ కు వినిపించి ఓకె చేయించుకున్నట్లు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి సినిమా పూర్తికాగానే ఇది ప్రారంభమవుతుంది.

నాన్నకు ప్రేమతో, రంగస్థలం రెండు సినిమాల్లోనూ కుటుంబ సంబంధాలు బాగానే డీల్ చేసారు సుకుమార్. మళ్లీ అదేబాటులో వెళ్లబోతున్నారన్నమాట.