అల్లు అర్జున్‌కి ఫ్లాప్‌ భయం

'నా పేరు సూర్య'కి ముందు వచ్చిన అల్లు అర్జున్‌ చిత్రాల్లో చాలా వాటికి టాక్‌ సరిగా రాలేదు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌ అండతో సమ్మర్‌ వసూళ్లు వచ్చి పడిపోవడంతో అల్లు అర్జున్‌ కథల ఎంపిక…

'నా పేరు సూర్య'కి ముందు వచ్చిన అల్లు అర్జున్‌ చిత్రాల్లో చాలా వాటికి టాక్‌ సరిగా రాలేదు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌ అండతో సమ్మర్‌ వసూళ్లు వచ్చి పడిపోవడంతో అల్లు అర్జున్‌ కథల ఎంపిక పట్ల శ్రద్ధ చూపించలేదు. అయితే ఎల్లకాలం కాలం కలిసి రాదు కనుక అదంతా కలిసి 'నా పేరు సూర్య' విషయంలో తేడా అయింది. భారీ ఫ్లాప్‌గా మిగిలిన ఈ చిత్రంతో అల్లు అర్జున్‌ ఆలోచనలో పడ్డాడు.

రామ్‌ చరణ్‌ ఫుల్‌ ఫామ్‌లోకి రావడం, మహేష్‌, ఎన్టీఆర్‌ ఇద్దరూ కూడా తమ స్టార్‌డమ్‌ నిలుపుకోవడంతో అల్లు అర్జున్‌ ఇప్పుడు ఫ్లాప్‌ అయ్యే రిస్క్‌ చేయలేడు. ముఖ్యంగా మెగా అభిమానుల నుంచి సహకారం ఇంతకుముందులా లేదు కనుక అల్లు అర్జున్‌ ఛాన్స్‌ తీసుకోలేడు. అందుకే తదుపరి చిత్రాన్ని అనౌన్స్‌ చేయడానికి కూడా అతను చాలా సమయం తీసుకుంటున్నాడు.

ఇప్పటికే తనకి విక్రమ్‌ కుమార్‌ పలు కథలు వినిపించాడని సమాచారం. అయితే అల్లు అర్జున్‌కి ఏ కథపై పూర్తిగా గురి కుదరలేదట. విక్రమ్‌ మంచి దర్శకుడే అయినప్పటికీ అతని చిత్రాలకి కమర్షియల్‌ రీచ్‌ తక్కువ. అందుకే అతని సినిమా అంటూ చేస్తే ప్రయోగాత్మకంగా కాకుండా అందరికీ నచ్చే విధంగా వుండాలని అల్లు అర్జున్‌ భావిస్తున్నాడట. మామూలుగా తన తదుపరి చిత్రాన్ని ముందే ఓకే చేసి పెట్టుకునే స్టయిలిష్‌ స్టార్‌పై ఈసారి ఒత్తిడి తీవ్రంగానే వుంది.