పార్క్ హయాత్ లో అమెరికా

సినిమా బడ్జెట్ బట్టే ఏదయినా వుంటుంది. డబ్బులుంటే ఫారిన్ లో తీస్తారు. డబ్బులు లేకుంటే  ఫారిన్ లో తీయాల్సింది కాస్తా ఎక్కడో ఒకదగ్గర కానిచ్చేయాల్సి వుంటుంది. ప్రస్తుతం శ్రీనువైట్ల తయారుచేస్తున్న అమర్ అక్బర్ ఆంథోని…

సినిమా బడ్జెట్ బట్టే ఏదయినా వుంటుంది. డబ్బులుంటే ఫారిన్ లో తీస్తారు. డబ్బులు లేకుంటే  ఫారిన్ లో తీయాల్సింది కాస్తా ఎక్కడో ఒకదగ్గర కానిచ్చేయాల్సి వుంటుంది. ప్రస్తుతం శ్రీనువైట్ల తయారుచేస్తున్న అమర్ అక్బర్ ఆంథోని సినిమా పరిస్థితి ఇదేనంట.

దర్శకుడు శ్రీనువైట్ల పరిస్థితి తెలిసిందే కదా? రాక రాక, లేక లేక సినిమా వచ్చింది. కానీ నిర్మాతలు ఒకటే కండిషన్ పెట్టారు. ఇచ్చిన బడ్జెట్ లోనే సినిమా చేయాలి. అందుకు మించి పైసా బడ్జెట్ పెంచమని చెప్పేసారట. అదే సమస్య అవుతోంది. మిస్టర్ సినిమాకు నిర్మాతలు ముందు చెప్పిన ఫిగర్ ఒకటి, తరువాత ఫిగర్ ఒకటి అయినా భరించారు. ఖర్చుచేసి చేతులు కాల్చుకున్నారు.

కానీ ఇక్కడ అలాంటి సీన్ లేదు. అందుకే ఖర్చు తగ్గించుకునేందుకు చాలామార్గాలు వెదుకుతున్నారట దర్శకుడు శ్రీనువైట్ల. డైరక్టర్ డిపార్ట్ మెంట్ లో వీలయినంత మంది తక్కువ స్టాఫ్ ను పెట్టుకున్నారట. ఈ సినిమాకు రెండు షెడ్యూళ్లు అమెరికాలో చేయాలి. ఒకటి చేసారు. రెండోది చేయాలి. ఇప్పుడు ఈ రెండో షెడ్యూలును వీలయినంత కుదించేసారని వినికిడి.

అమెరికాలో ఇన్ సైడ్ చేయాల్సిన అనేక సీన్లను ఇక్కడ స్టార్ హోటళ్లలో చిత్రకరిస్తున్నారట. పార్క్ హయాత్ లాంటి ఖరీదైన హోటళ్లను అమెరికా లోకేషన్ల కింద చూపిస్తారన్నమాట. బడ్జెట్ లిమిటేషన్లు లేకుండా సినిమాలు చేసిన శ్రీనువైట్లు ఇప్పుడు ఆచితూచి ఖర్చుచేస్తూ, సినిమా చేయాల్సి వస్తోంది.