చాలా వేగంగా నడుస్తోంది ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌ల ప్రేమ కథ. ఈ మధ్యనే వీళ్లిద్దరూ ప్రేమలో పడినట్టుగా వార్తలు వచ్చాయి. అప్పుడే నిశ్చితార్థం అనే వార్తలు వస్తున్నాయి.
నిక్ జోనస్ అనే ఆ అమెరికన్ కుర్రాడు ప్రియాంకతో పాటు ఇండియాకు రావడం వెనుక నిశ్చితార్థం ప్లాన్ ఉందని బాలీవుడ్ మీడియా చెబుతోంది.
అమెరికాలో ముందుగా వీళ్లిద్దరూ విమానాశ్రయంలో కనిపించారు, ఆపై ముంబైలో మీడియా కంటబడ్డారు. ఆ తర్వాత ఈవెనింగే వీళ్లు ముంబైలో డిన్నర్ డేట్‌లో అగుపించారు. ఆ సమయంలో ప్రియాంక వెంట ఆమె తల్లి కూడా ఉండటం గమనార్హం.
ప్రియుడిని తన కుటుంబీకులకు పరిచయం చేయడానికే ప్రియాంక అతడిని ఇండియాకు తీసుకొచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ డిన్నర్ డేట్‌తో వీరి ప్రేమకథ శరవేగంగా నడుస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అతడు ఇండియాకు వచ్చింది నిశ్చితార్థం కోసమే అని ప్రచారం జరుగుతోంది.
మరి ఈ కథ ఇప్పుడు నిశ్చితార్థంతోనే ఆగుతుందా? లేక త్వరలోనే పెళ్లి కూడానా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ప్రియాంక స్పందించడం లేదు. ఊహాగానాలకే వదిలేస్తోంది. నిక్ ఆమె కన్నా దాదాపు పదేళ్లు చిన్నవాడు. అందులోనూ పాతికేళ్ల వాడు. ఇది వరకూ పలువురు హీరోయిన్లు తమ కన్నా చిన్న మగాళ్లను పెళ్లి చేసుకున్నారు.
అయితే ప్రియాంక మరీ పదేళ్ల చిన్నవాడిని, కుర్రాడిని బుట్టలోకి పడేసినట్టుగా ఉంది.