బిగ్ బాస్ షోలో శ్రీరెడ్డి అని చాలా మీడియాలు రాసుకుంటూ వచ్చాయి. కానీ శ్రీరెడ్డి ఆశ నిరాశే, ఆమె కోరినా 'స్టార్ మా' మాత్రం ఆమెను బిగ్ బాస్ లోకి తీసుకోవడాన్ని కన్సిడర్ చేయలేదు అని గ్రేట్ ఆంధ్ర ఎప్పుడో వెల్లడించింది. ఇప్పుడు పరోక్షంగా శ్రీరెడ్డి కూడా అదే విషయాన్ని ధృవీకరించింది. నాని కాపురంలో నిప్పులు పోసేలాంటి డర్టీ పిక్చర్ వదుల్తున్నానహో అని ప్రకటించడం అంటే ఇంకేం అనుకోవాలి?
బిగ్ బాస్ పోటీదారులు ఎవ్వరన్నది స్టార్ మాలో చాలా అంటే చాలా కొద్ది మందికే తెలుస్తుంది. అయితే పరిశీలనలో వుండే జాబితా మాత్రం చాలా పెద్దదే వుంటుంది. ఇప్పటికి గాయని గీతామాధురి, యాంకర్ శ్యామల వుంటారని మాత్రం పక్కాగా వినిపిస్తోంది.
బిగ్ బాస్ షో ప్రారంభం రోజున మాత్రమే ప్రేక్షకులకు తెలుస్తుంది. ఎవరు హౌస్ లో వుంటారో? ముందురోజు మాత్రం పాల్గోనేవారికి తెలుస్తుంది. ముందురోజు వరకు సుమారు ఇరవై మంది వరకు అలా లైన్లో వుంచుతారు తప్ప, పక్కానా? కాదా? అన్నది చెప్పరు.
అందువల్ల స్టార్ మా అవసరం అనుకుంటే శ్రీరెడ్డిని తీసుకోవడానికి ముందురోజు వరకు చాన్స్ వుంది. ఆ సంగతి తెలిసే శ్రీరెడ్డి ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా అస్త్రం ప్రయోగిస్తే, బిగ్ బాస్ హవుస్ లోకి అడుగు పెట్టొచ్చు అన్నది శ్రీరెడ్డి అయిడియా అనుకోవాలి. కానీ ఈ లెవెల్ కు విషయం చేరుకున్న తరువాత ఆ చాన్స్ వుండదు. వుంటే నాని జంకేసాడని వార్తలు వస్తాయి. అందువల్ల శ్రీరెడ్డి అస్త్రం వల్ల ఉపయోగం వుండకపోవచ్చు.