నెల గ్యాప్ లో రెండు సినిమాలు

సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో రాజ్ తరుణ్. నెంబర్లు కనిపిస్తున్నాయి కానీ హిట్ లు కనిపించడం లేదు. ఆ మాటకు వస్తే కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్తా మావా తరువాత చెప్పుకోదగ్గ సినిమా…

సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో రాజ్ తరుణ్. నెంబర్లు కనిపిస్తున్నాయి కానీ హిట్ లు కనిపించడం లేదు. ఆ మాటకు వస్తే కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్తా మావా తరువాత చెప్పుకోదగ్గ సినిమా లేదు. దీంతో ఎక్కడ స్టార్ట్ అయ్యాడో అక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు రెండు సినిమాలు చేతిలో వున్నాయి.

ఒకటి రాజు గాడు, రెండు లవర్. ఈ రెండు సినిమాలు నెల రోజుల గ్యాప్ లో వచ్చేస్తున్నాయి. జూన్ 1న ఇది వస్తే, జూలై 12న అది వస్తోంది. ఆ తరువాత మరి సినిమా ఇప్పట్లో వుండదు. కుమారి 21ఎఫ్ డైరక్టర్ తో సినిమా వుంది. అది రావడానికి మరో మూడు నెలలు పడుతుంది.

రాజూగాడు హిట్ కావడం రాజ్ తరుణ్ కు చాలా అవసరం. దాని మీదే లవర్ సినిమా ఓపెనింగ్స్, బిజినెస్ ఆథారపడి వుంటుంది. ఈ రెండు సినిమాలు బట్టే తరువాత సినిమా. కేవలం తను అనుకున్నది చేసుకుంటూ వెళ్లడం తప్ప, ప్రాపర్ ప్లానింగ్ కొరవడడంతో రాజ్ తరుణ్ కెరీర్ ఒడిదుడుకుల్లో పడింది. ఆఖరికి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చేస్తా అని అనేంత వరకు వెళ్లింది.

నిజానికి రాజ్ తరుణ్ ఏజ్ గ్రూప్, రేంజ్ హీరోలు అనాల్సిన మాట కాదు. అనకూడని మాట అది. కానీ ఆమాట అన్నాడు, అంటే ఇప్పటికీ రాజ్ తరుణ్ ప్లానింగ్ గాడిలోపడినట్లు కనిపించడం లేదు.