అయిదు పాటలు.. అయిదుగురు సింగర్లు

పంచభూతాల కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా సాక్ష్యం అన్న సంగతి తెలిసిందే. అందుకోసమే అయిదు కీలక ఘట్టాలు, అయిదు భారీ ఫైట్లు వుంటాయని ఇంతకు ముందు వెల్లడించాం. ఇప్పుడు ఇంకో అప్ డేట్. అయిదు…

పంచభూతాల కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా సాక్ష్యం అన్న సంగతి తెలిసిందే. అందుకోసమే అయిదు కీలక ఘట్టాలు, అయిదు భారీ ఫైట్లు వుంటాయని ఇంతకు ముందు వెల్లడించాం. ఇప్పుడు ఇంకో అప్ డేట్. అయిదు ఎపిసోడ్ లకు అయిదు పాటలు కూడా వుంటాయట.

ఈ అయిదు పాటలను అయిదుగురు ఫేమస్ సింగర్లు పాడడం విశేషం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జేసుదాస్, కైలాస్ ఖేర్, హరిహరన్, బాంబే జయశ్రీ ఆలపించిన గీతాలను అనంత్ శ్రీరామ్ రచించారు. అయిదు పాటలు గాలి, నిప్పు, నీరు, భూమి, ఆకాశాలపై వుంటాయి.

శ్రీవాస్ డైరక్షన్ లో అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ హీరో. ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.