కళ్యాణ్ రామ్ తొలిసారి లవర్ బాయ్ గా నటిస్తూ, తమన్నాతో రొమాన్స్ చేస్తూ నటించిన సినిమా నా నువ్వే. వాస్తవానికి ఈ సినిమా ఈనెల 25న విడుదల కావాల్సి వుంది. కానీ సిజి వర్క్, ఇంకా మరి కొన్ని కారణాల రీత్యా వాయిదా పడింది. సెన్సార్ వర్క్ పూర్తయింది. క్లీన్ యు వచ్చింది. కానీ విడుదల డేట్ రాలేదు.
ఇప్పుడు ఆ డేట్ వచ్చింది. జూన్ 14 డేట్ గా ఫిక్స్ చేసారు. ఇప్పటికే ఈ డేట్ కు రెండు సినిమాలు రుమాలు వేసాయి. సుధీర్ బాబు-ఇంద్రగంటిల సమ్మోహనం సినిమా, అలాగే శ్రీవాస్-బెల్లంకొండ శ్రీనివాస్ ల సాక్ష్యం సినిమాలు షెడ్యూలు అయివున్నాయి. కానీ సాక్ష్యం సినిమా సిజి వర్క్ తదితర పనులు చాలా వున్నాయి. అందువల్ల ఆ సినిమా వస్తుందా అన్నది అనుమానమే.
అంటే రెండు ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీస్ నా నువ్వే, సమ్మోహనం సినిమాలు ఆ రోజు ఢీకొంటాయన్నమాట. రెండు సినిమాలు కూడా ఎ సెంటర్ క్లాస్ లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలు కావడం విశేషం.