డైరక్షన్ తప్ప అన్నీ చేస్తున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. దర్శకత్వం రామ్ గోపాల్ వర్మ అని పోస్టర్ మీద కనిపించడమే తప్ప, సినిమాలో ఆయన మార్కు వుండక, అన్నీ బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేస్తున్నాయి. ఏళ్ల కాలంగా ఒక్కటంటే ఒక్క హిట్ లేదు ఆయన ఖాతాలో. ఈలోగా ఆయన రకరకాల పనులు చేస్తుంటాడు. ట్విట్టర్ హడావుడి, పోర్నోసినిమా, ఆ మథ్య నేరుగా డిస్ట్రిబ్యూషన్, ఇలా రకరకాల పనులు చేసారు. చేస్తున్నారు.
ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తబోతున్నారు. హైదరాబాద్ లో ఫిల్మ్ స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అన్నపూర్ణ, రామానాయుడు, ప్రసాద్ ల్యాబ్ వంటి సంస్థలు ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లు నడుపుతున్నాయి. వీటకి ఆర్జీవీది అదనం అన్నమాట.
అయితే నాగార్జున, సురేష్ బాబులు చాలా సీరియస్ గా తమ తమ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లను రన్ చేస్తున్నారు. వాటికి ఇప్పటికే ఓ స్థాయి వచ్చింది. ఆర్జీవీ దగ్గర చాలా మంది అమెచ్యూర్ లు డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో చేరుతున్నారు. నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఇన్ స్టిట్యూట్ పెట్టడం ఇదే మొదలు. మరి దీనిని అయినా ఆయన సీరియస్ గా రన్ చేస్తారో లేదో చూడాలి.