ఇక విశాల్ సినిమాలు ఇంతేనా?

ఒకప్పుడు విశాల్ సినిమాలు అంటే తెలుగులో కూడా మంచి మార్కెట్ వుండేది. బి సి సెంటర్లలో మినిమమ్ గ్యారంటీ వుండేది. కానీ ఇప్పుడు విశాల్ సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. అంతే. అంతకు మించి ఇంపాక్ట్…

ఒకప్పుడు విశాల్ సినిమాలు అంటే తెలుగులో కూడా మంచి మార్కెట్ వుండేది. బి సి సెంటర్లలో మినిమమ్ గ్యారంటీ వుండేది. కానీ ఇప్పుడు విశాల్ సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. అంతే. అంతకు మించి ఇంపాక్ట్ ఏమీ వుండడం లేదు. సినిమాలు బాగాలేకపోతే అది వేరే సంగతి. మంచి సినిమాలు వచ్చినా ప్రాపర్ రిలీజ్ వుండడం లేదు.

విశాల్ మొహమాటానికో, మరో కారణంగానో సినిమాలు ఒకరికే ఇస్తున్నారని, వాళ్లు సినిమాను ప్రాపర్ గా మార్కెట్ చేయడం లేదని, ఈ విషయం పట్టించుకోక, విశాల్ తన మార్కెట్ ను పాడు చేసుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. డిటెక్టివ్ సినిమాకు తమిళనాట మంచి పేరు వచ్చింది. ఇక్కడ కూడా ఆన్ లైన్ లో మంచి వ్యూస్ వచ్చాయి. కానీ తెలుగులో వచ్చి వెళ్లిన సంగతే తెలియదు.

అభిమన్యుడు సినిమా మరో వారంలో వస్తోంది. ఆ సినిమా తమిళంలో పెద్ద హిట్. కానీ ఇక్కడ చూస్తే ఆ సినిమాకు మినిమమ్ బజ్ లేదు. సినిమాను ప్రాపర్ గా పబ్లిసిటీ చేయడం, మార్కెట్ చేయడం, ఇలాంటివి అన్నీ తెలుగు వెర్షన్ జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. విశాల్ వస్తున్నాడు ఓ ప్రెస్ మీట్ హోల్డ్ చేస్తున్నాడు, వెళ్తున్నాడు. సినిమా కూడా అంతే. వస్తోంది, వెళ్తోంది అంతే.

ఇకనైనా సరైన జాగ్రత్త తీసుకోకపోతే విశాల్ సినిమాలు మరీ లో బడ్జెట్ చిన్న సినిమాల మాదిరిగా జనాలకు తెలియకుండానే వచ్చి వెళ్లిపోయే ప్రమాదం వుంది.

విశాల్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి