ఛలో సినిమాతో ఒక్కసారిగా పెద్ద హిట్ కొట్టాడు నాగశౌర్య. కానీ ఆ తరువాత వచ్చిన కణం ఎవరికీ తెలియకుండానే వచ్చి వెళ్లింది. అమ్మమ్మగారిల్లు సినిమాకు మాంచి పబ్లిసిటీ చేసారు. అయితే శతమానం భవతి లుక్ అన్న టాక్ వచ్చి, సగటు సినిమాగా మిగిలింది.
ఈ రెండు సినిమాలు కూడా నాగశౌర్య ఛలోకు ముందు ఒకె చేసినవే. ఛలో తరువాత పెద్దగా గ్యాప్ లేకుండానే వచ్చేసాయి రెండు సినిమాలు. కానీ నాగశౌర్య కెరీర్ కు చేసిన మేలు అయితే ఏదీ లేదనే చెప్పాలి.
ఛలో తరువాత మళ్లీ ఇప్పుడు విజయం కోసం వెదుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. స్వంత బ్యానర్ లో @నర్తనశాల సినిమా రెడీ అవుతోంది. మరోపక్క భవ్య వారి సినిమా వుంది. దానికి ఓ..న..మ లేదు. అంటే నర్తనశాల సినిమా ఒక్కటే శౌర్య మార్కెట్ ను మళ్లీ నిలబెట్టాల్సిన సినిమా. అది కూడా స్వంత బ్యానర్ లో కాబట్టి, పబ్లిసిటీకి ఢోకాలేదు.
కానీ మళ్లీ ఆ తరువాత ఏంటీ? అంటే చూడాల్సి వుంది. కోనవెంకట్ అండ్ కో సినిమాను పక్కన పెట్టేసారు. భవ్య సినిమాకు ఇంకా కథ, డైరక్టర్ సెట్ కావాలి. అంటే మరో రెండు నెలల్లో స్వంత సినిమా విడుదలకు రెడీ అయిపోతే, శౌర్య మళ్లీ సినిమా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వుంది. ప్లానింగ్ పక్కాగా లేకపోతే ఇలాగే సమస్యలు వస్తాయేమో?