మెగా అల్లుడి సాదా లుక్

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ తో అతిచిన్న సినిమాను సాయి కొర్రపాటి లాంటి ప్రొడ్యూసర్ ప్లాన్ చేసినపుడే జనాలకు..కాస్త ఆలోచించారు. కొడుకును ఓ రేంజ్ లో లాంచ్ చేసిన మెగాస్టార్ అల్లుడిని ఇలా వదిలేసాడేమిటా?…

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ తో అతిచిన్న సినిమాను సాయి కొర్రపాటి లాంటి ప్రొడ్యూసర్ ప్లాన్ చేసినపుడే జనాలకు..కాస్త ఆలోచించారు. కొడుకును ఓ రేంజ్ లో లాంచ్ చేసిన మెగాస్టార్ అల్లుడిని ఇలా వదిలేసాడేమిటా? అని. జతకలిసే అని జనాలకు అంతగా పట్టని సినిమాను అందించిన దర్శకుడి చేతిలో కుర్రాడిని పెట్టేసారేమిటా? అని గుసగుసలు కూడా వినిపించాయి.

ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కే కిందామీదా అయ్యారు. దశరధరామయ్య అంటూ సాఫ్ట్ టైటిల్ పెడదాం అనుకున్నారు. కానీ మెగాఅల్లుడు మాంచి కిక్కిచ్చే టైటిల్ కావాలని పట్టుపట్టడంతో, విజేత అని టైటిల్ మార్చక తప్పలేదు. సరే టైటిల్ బాగుంది. అని అనుకుంటే ఇప్పుడు జస్ట్ సాదాసీదా లుక్ బయటకు వదిలారు.

మురళీ శర్మ అటు తిరిగి, కళ్యాణ్ దేవ్ ఇటు తిరిగి వున్న ఓ పోస్టర్ బయటకు వచ్చింది. హీరో ఫేస్ మీద, పిక్చర్ మీద ఫోటోషాఫ్ ఎఫెక్ట్ లు చాలా పడినట్లు కనిపిస్తున్నాయి. లాంగ్ లో చూస్తే సందీప్ కిషన్ మాదిరిగా సాఫ్ట్, సాదా లుక్ తో వున్నాడు కళ్యాణ్ దేవ్. సినిమా చూస్తే ఫ్యామిలీ డ్రామా అంటున్నారు, కుర్రాడు చూస్తే సాఫ్ట్ లుక్ తో వున్నాడు. మెగాభిమానులు ఏ మేరకు లైక్ చేస్తారో చూడాలి.

అయినా మనలో మాట, వాళ్లు మాత్రం భుజాలపై ఎంతమంది హీరోలను మోస్తారు?