నిన్నకి నిన్న ఎన్టీఆర్ బర్త్ డే అంటూ అటు మీడియాకు, ఇటు సన్నిహితులకు భారీగానే పార్టీలు ఇచ్చారు. అయితే పార్టీ అనంతరం డైరక్టర్ బాబీ ఇంటికి వెళ్తూ కారు యాక్సిడెంట్ చేసాడని వార్తలు గుప్పు మన్నాయి. కానీ రాత్రికి రాత్రి ఎవరో పెద్దలు కలుగ చేసుకుని కేసు పెట్టకుండా చేసారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు వాట్సప్ లో కూడా కొన్ని మెసేజ్ లు చలామణీ కావడం విశేషం. బాబీ తరపున హీరోలో, మరెవరో ఫోన్ లు చేసి, రాజీ జరిగేలా చేసారని సమాచారం అందించడం ఒక పక్క, బాధితులకు న్యాయం చేయకుండా, కేసు పెట్టకుండా, బాబీని తప్పించారని మరోపక్క సమాచారం వుంది. అయితే ఏ విషయం ఇంకా క్లియర్ గా బయటకు రాలేదు.
ప్రమాదం రోడ్ నెం 33లో జరిగిందని, ఆ టైమ్ లో బాబి కారు ఢీకొన్న కారణంగా ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కారు పాడయిందని, అతనికి, అతని తాలూకు జనాలకు గాయాలు అయ్యాయని వినిపిస్తోంది. కానీ నిర్థారణ లేదు. క్రైం రిపోర్టర్లు రంగ ప్రవేశం చేస్తే తప్ప అసలు వార్త పూర్తిగా బయటకు రాదేమో?