మైత్రీ నిర్మాతలపై చరణ్ ఫ్యాన్స్ గుస్సా

ఈ ఏడాది తొలి సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ రంగస్థలం. అందులో అణుమాత్రం సందేహం లేదు. అయితే ఇప్పటికి ఈ సినిమా రెండు వందల కోట్లు గ్రాస్ సాధించింది. ఇంకా విడుదలైన అన్ని సెంటర్లలో…

ఈ ఏడాది తొలి సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ రంగస్థలం. అందులో అణుమాత్రం సందేహం లేదు. అయితే ఇప్పటికి ఈ సినిమా రెండు వందల కోట్లు గ్రాస్ సాధించింది. ఇంకా విడుదలైన అన్ని సెంటర్లలో షేర్ రాబడుతోంది. అయితే రంగస్థలం సినిమాకు సంబంధించి పబ్లిసిటీకి ఏనాడో దాదాపు ఫుల్ స్టాప్ పెట్టారు. నిర్మాతలు విదేశాల్లో విహారాల్లో వున్నారు. ఇక్కడ పట్టించుకునే వారు లేరు. సరే, ఏమీ పట్టించుకోకున్నా షేర్ వస్తోంది కదా? అంటే, అక్కడే వస్తోంది తకరారు.

రంగస్థలం తరువాత విడుదలయిన భరత్ అనే నేను సినిమా కూడా సూపర్ హిట్ అయింది. వంద కోట్లను దాటి కలెక్షన్లు వసూలు చేసింది. అయితే ఇప్పటికే 200కోట్ల గ్రాస్ అందుకుందని, త్వరలో 250కోట్ల గ్రాస్ పక్కా అని తెగ వార్తలు కనిపిస్తున్నాయి. అలాగే ఓవర్ సీస్ లో రంగస్థలం మూడున్నర మిలియన్లు చేసింది. భరత్ అనే నేను దాని వెనుకే వుంది. అయితే పబ్లిసిటీ వేరుగా వుంది. 30రోజుల్లో రంగస్థలం సాధించిన కలెక్షన్లు, భరత్ కేవలం 12రోజుల్లో కొట్టేసిందని హడావుడి చేస్తున్నారు. దీనిపై సోషల్ నెట్ వర్క్ లో ట్రోలింగ్ ఓ లెక్కలో వుంది.

రంగస్థలం కలెక్షన్లు ఇవీ, ఇప్పుడు వస్తున్న షేర్ ఇదీ, దాని లెవెల్ ఇదీ, ఇన్ని థియేటర్లలో వుందీ అని యూనిట్ తరపున చెప్పేవారు ఎవ్వరూ కనిపించడం లేదు. ఇదంతా కావాలనే చేస్తున్నారని, మైత్రీ మూవీస్ కు మహేష్ బాబుతో వున్న మంచి సంబంధాల కారణంగానే, భరత్ కు పోటీగా రంగస్థలం గురించి పెద్దగా పబ్లిసిటీ చేయడం లేదని చరణ్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. భరత్ నిర్మాతలు అఫీషియల్ గా గ్రాస్ ను ప్రకటిస్తున్నా, మైత్రీ జనాలు అలా ప్రకటించడం లేదని అంటున్నారు.

భరత్ కు పబ్లిసిటీ మీట్ లు తెగ పెడుతుంటే, రంగస్థలం 200కోట్లు దాటినా, ఓవర్ సీస్ లో మూడున్నర కోట్లు దాటినా ఒక్క మీట్ లేకపోవడం పట్ల చరణ్ ఫ్యాన్స్ తెగఫీలవుతున్నారట.