టాలీవుడ్ లో, మీడియాలో కీలక మలుపులకు దారితీసిన శ్రీరెడ్డి ఇప్పుడు ప్రత్యక్ష పోరుకు దిగుతోందా? పోలీస్ ఇంటిలిజెన్స్ వర్గాలు ఈమేరకు అనుమానపడుతున్నాయి. మహిళాసంఘాలతో కలిసి శ్రీరెడ్డి అటు రామానాయుడు స్టూడియో దగ్గర లేదా? ఓ డైరక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగబోతోందని పోలీస్ వర్గాలుకు సమాచారం అందినట్లు బోగట్టా. దీంతో రామానాయడు స్టూడియో దగ్గర భారీ బంధోబస్త్ ఏర్పాట్లుచేసారు.
కాస్త చెప్పుకోదగ్గ సంఖ్యలోనే పోలీసులను మోహరించారు. శ్రీరెడ్డి ఉదంతం టీవీ చానెళ్ల పుణ్యమా అని ఉవ్వెత్తున లేచి, అణగారిపోయింది. చానెళ్లు ఏవీ ఇప్పుడు శ్రీరెడ్డిని తమ డిస్కషన్లకు పిలవడం మానేసాయి. పోనీ పోరు ఏమన్నా ఫలితం ఇచ్చిందా అంటే, అదికాస్తా మీడియాకు, ఇండస్ట్రీకి నడుమ పోరుగా మారి, ఆఖరికి లోపాయకారీ వ్యవహారాలతో పరిసమాప్తం అయింది.
ఇప్పుడు మొత్తంమీద శ్రీరెడ్డి అన్నింటికి చెడిన రేవడి అయినట్లు కనిపిస్తోంది. బహుశా అందుకే ఆమె మరోసారి లైమ్ లైట్ లోకి రావాలనుకుంటోందేమో? డిస్కషన్లకు పిలవకపోవచ్చు. ధర్నా చేస్తే కొంతయినా చూపించాలి కదా? ఆ విధంగా మళ్లీ శ్రీరెడ్డి చానెళ్లలో కనిపించే చాన్స్ వుంది.