స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మానుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో లగడపాటి శిరిషా శ్రీధర్ నిర్మాతగా, బన్నీవాసు సహ నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’’. ఈ చిత్రానికి సంబంధించి ఆడియో విడుదల లాంటి వేడుకలు అన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. మే 4వ తేదీన సినిమా విడుదల కాబోతుండగా.. ప్రి-రిలీజ్ ఫంక్షన్ ని గచ్చిబౌలి అవుట్ డోర్ స్టేడియంలో అత్యంత భారీగా దాదాపు కొటి రూపాయల వ్యయంతో నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
సినిమా ఫంక్షన్ అంటే ఏదో రెండు పాటలు.. ఆ సినిమా ఒక అద్భుతం అని పొగుడుతూ కొన్ని స్పీచ్ లు మాత్రమే ఉంటాయి. ఫ్యాన్స్ కు కాస్త కిక్ ఇచ్చేలాగా.. కొన్ని కార్యక్రమాలు ఉంటాయని అంతా అనుకుంటారు. కాని ‘నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ వేడుకలో ఏదో సర్ప్రైజ్ ఉండబోతున్నదని ఇండస్ట్రీలో బాగా ప్రచారం జరుగుతోంది.
అలాంటి సర్ ప్రైజ్ తో కనీవినీ ఎరుగని రీతిలో ఫంక్షన్ చేద్దాం అని వివరించి చెప్పినప్పుడే అల్లు అర్జున్ అందుకు అంగీకరించినట్లుగా చెప్పుకుంటున్నారు. రెగ్యులర్ ఫంక్షన్స్ కి బన్ని ఈ మద్య దూరంగా వుంటున్నాడు. ఈ సినిమా వేడుకకు ముచ్చటపడి ఒప్పుకునేలా బన్నీని ఊరించిన ఆ సర్ ప్రైజ్ ఏంటి?
విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఈ ప్రీరిలీజ్ ఫంక్షన్ వేదిక మీదకి.. బన్నీ ఎంట్రీ అనేదే చాలా కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. సినిమా థీమ్ తెలిసివచ్చేలా కాస్త జిమ్నాస్టిక్స్ కూడా జోడించి.. ఒక ప్రత్యేకమైన ఎంట్రీని ప్లాన్ చేశారుట. దేశభక్తిని కూడా ప్రతిబింబించేలా కాస్త జిమ్నాస్టిక్స్ ఎఫెక్టులతో బన్నీ.. వేదిక మీదకు వస్తాడన్నమాట. వేదిక మీదికి చాలా సింపుల్ గా హీరోలు నడుచుకుంటూ వచ్చేయడం మనకు తెలుసు.. కానీ తన మార్క్ ప్రత్యేకతను చాటుకోవడానికే బన్నీ ఇలా జిమ్నాస్టిక్స్ జోడించిన ఎంట్రీకి ఒప్పుకున్నారని చెబుతున్నారు.
కేవలం ఇలా వేదిక మీదికి బన్నీ ఎంట్రీ ఇవ్వడం కోసం.. 20లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. అంత భారీ ఖర్చుతో ఆయన ఎంట్రీ ఎలా ఉంటుందో తెలియాలంటే.. మరో మూడు రోజులు ఎదురు చూడాల్సిందే.