బాలయ్య మడమ తిప్పేసారా?

నందమూరి వంశం అంటే మడమతిప్పదని డైలాగులు వినిపిస్తూ వుంటాయి. అలాంటిది మోడీని తాను అభ్యంతరకంగా అనలేదని, మార్ఫింగ్ చేసి వీడియోలు వదిలారని నందమూరి బాలకృష్ణ ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసారు. డిజిటల్ రుజువులు పుట్టుకువచ్చిన…

నందమూరి వంశం అంటే మడమతిప్పదని డైలాగులు వినిపిస్తూ వుంటాయి. అలాంటిది మోడీని తాను అభ్యంతరకంగా అనలేదని, మార్ఫింగ్ చేసి వీడియోలు వదిలారని నందమూరి బాలకృష్ణ ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసారు. డిజిటల్ రుజువులు పుట్టుకువచ్చిన ఈ రోజుల్లో మార్పింగ్ అన్నమాట కామన్ అయిపోయింది. గతంలో అయితే ప్రతిపక్షాల కుట్ర అనే పదం వినిపించేది. కానీ ఇప్పుడు డిజిటల్ సాక్ష్యాలు వుంటున్నాయి కాబట్టి మార్ఫింగ్ చేసారు అంటున్నారు.

అయితే ఇక్కడ కూడా ఓ విషయం గమనించాలి. లైవ్ ప్రసారాల్లో మార్ఫింగ్ అన్నది సాధ్యంకాదు. బాలకృష్ణ కావాలి అనుకుంటే వివిధ ఛానెళ్లలో ప్రసారం అయిన లైవ్ ప్రోగ్రామ్ లను తెప్పించి చూడడం, ఆపై వాటిని జనాలకు చూపించి, మార్ఫింగ్ చేసారని చెప్పడం సబబుగా వుంటుంది. అంతేకానీ ఇలా మాట్లాడితే కేసులకు జనాల్లో వచ్చిన రియాక్షన్ కు భయపడి మడమ తిప్పేసినట్లు వుంటుంది.

ఎందుకంటే చాలా వీడియోల్లో ‘వాళ్లని అడ్డం పెట్టుకుని, ఓ శిఖండి లాగా.. ఓ కొ….లాగా సీట్లు గెలవాలనుకుంటున్నారు. వాళ్లకి రావు వీళ్లకు రావు. ‘ అని బాలయ్య అన్నట్లు వుంది. మొత్తంమీద ఇప్పుడు భాజపా సీరియస్ గానే వున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ అక్కడ కేసుల రిజిస్టర్ అవుతున్నాయి. 

అయితే తెలుగుదేశం అనుకూల మీడియా తమ తమ యూట్యూబ్ చానెళ్లలోంచి ఈ వీడియోలు తీసేయచ్చు. కానీ సంబంధిత అధారిటీలు అడిగితే ఆనాటి లైవ్ వీడియోలు సమర్పించాల్సి వుంటుంది. మరి అప్పుడు ఏం వివరణ ఇస్తారో? అయినా అంతవరకు వస్తుందని అనుకోవడానికి లేదు. అందుకే పూర్వరంగంగా ఈ వివరణ ఇచ్చి వుండొచ్చు.