మంచిదో, చెడ్డదో, మొత్తానికి శ్రీరెడ్డి ఓ సంచలనం. ఆర్జీవీ చెప్పినంత కాకపోయినా, ఓ ఉవ్వెత్తున లేచిపడిన కెరటం. సోషల్ నెట్ వర్క్ లో ఆమెకున్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. ఫేస్ బుక్ లో దాదాపు 60లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. దాదాపు అంతేమంది ఆమె ఫేస్ బుక్ పేజ్ ను లైక్ చేస్తున్నారు. ట్విట్టర్ లో 22వేల మందికి పైగా ఆమెకు ఫాలోవర్లు వున్నారు.
అయితే కేవలం ఫాలోవర్లు వుండడం కాదు. ఆమె ఓ పోస్ట్ పెడితే అది వైరల్ అయిపోతోంది. ఈ రోజు 10.37కి ఒక్క లైన్.. ఈ ప్రపంచంలో ఒంటరి దాన్ని అనిపిస్తోంది.. అని పెడితే గంట గడవకుండా మూడువేల మంది కామెంట్లు, మూడున్నర వేలమంది రియాక్షన్లు.
కానీ పాపం, ఇంత మూవ్ మెంట్ ను ఒక్కమాటతో పాడు చేసుకుంది. నిజానికి పవన్ ను అనవసరంగా ఈ ఇష్యూలోకి లాగకుండా, తను అనుకున్న రీతిగా, కేవలం అమ్మాయిల సమస్య మీద పోరాటం అలా సాగించి వుంటే వేరుగా వుండేది. ఆమెకు వచ్చిన మద్దతు, జనరేట్ అయిన సింపతీ అలాగే వుండేది. కానీ ఇప్పుడు మొత్తం పోయింది.
ఆమెకు ఆమే చెప్పుకున్నట్లు ఒంటరిగా మిగిలిపోయింది. దీనికి కారణం ఆమే. ఇప్పుడు ఆమె ఫోన్ చేస్తే ఎత్తడానికి ఎవరికైనా భయం. రికార్డు చేస్తుందేమో అని? వాట్సప్ మెసేజ్ చేస్తే భయం, హాయ్ అంటే ఎక్కడ స్క్రీన్ షాట్ లు తీస్తుందేమో అన్న భయం.
ఇలా ప్రతి ఒక్కరిని సందేహాల్లోకి నెట్టేసుకుంది శ్రీరెడ్డి. ఇక ఎవరు వుంటారు తోడు? ఒంటరిని అయిపోయానని అనుకోవడం కాదు, ఎందుకు? ఎలా అయిపోయానని ఆలోచించుకోవాలి. యాంకర్ గా ఎదిగి, అక్కడ నుంచి పక్కదారిలోకి వెళ్లిపోవడానికి కారణం ఎవ్వరో ఆలోచించుకుని తన జీవితాన్ని తానే మార్చుకోవాలి. సాధించిన ఫాలోయింగ్ ను మంచి విషయాలపై ఫైట్ చేయడానికి వాడుకోవాలి.