బోయపాటి సినిమాలో సిఎమ్ విలన్

ముఖ్యమంత్రిని హీరోను చేసి సినిమా తీసారు డైరక్టర్ కొరటాల శివ. కానీ మరో టాప్ డైరక్టర్ బోయపాటి శ్రీను మాత్రం సిఎమ్ ను విలన్ చేసి సినిమా తీస్తున్నారు. అయితే ఆంధ్ర, తెలంగాణ సిఎమ్…

ముఖ్యమంత్రిని హీరోను చేసి సినిమా తీసారు డైరక్టర్ కొరటాల శివ. కానీ మరో టాప్ డైరక్టర్ బోయపాటి శ్రీను మాత్రం సిఎమ్ ను విలన్ చేసి సినిమా తీస్తున్నారు. అయితే ఆంధ్ర, తెలంగాణ సిఎమ్ ల్లో ఎవరిని విలన్ గా చూపించినా, పాపం కష్టమే కదా? తెలంగాణలో వుంటూ సినిమాలు తీసుకోవాలి. ఆంధ్ర సిఎమ్ అంటే అమిత ప్రేమ. అందుకే ఏకంగా బీహార్ కు వెళ్లిపోయారు.

రామ్ చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్ సినిమా కూడా పోలిటికల్ బ్యాక్ డ్రాప్ నే అని తెలుస్తోంది. ఈ సినిమా బీహార్ నేఫథ్యంలో జరుగుతుంది. సో, బీహార్ ముఖ్యమంత్రితో హీరో పోరాటం సాగుతుందన్నమాట. ముఖ్యమంత్రిగా మహేష్ మంజ్రేకర్. మరో విలన్ గా వివేక్ ఓబరాయ్ కనిపిస్తారు.

అసలే స్క్రీన్ మీద భారీ యాక్షన్ సన్నివేశాలు పండించి, రక్తపాతాలు సృష్టించే బోయపాటి, ఇక బీహార్ బ్యాక్ డ్రాప్ సినిమా అంటే ఏ రేంజ్ లో హింసను ఆవిష్కరిస్తారో చూడాలి.