అన్న కళ్యాణ్ రామ్ సినిమా ప్రమోషన్ కు ఎన్టీఆర్ చేసింది ఏమీ లేదు. కానీ మహేష్ సినిమాకు బజ్ తీసుకురావడం కోసం ఆ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా వెళ్లడానికి ఫిక్స్ అయిపోయినట్లు వార్తలు వచ్చేసాయి. దీంతో కళ్యాణ్ రామ్ సన్నిహితులు ఫీలవుతున్నట్లు గుసగుసలు వినవస్తున్నాయి. ఇటీవల కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే సినిమా విడుదలయింది.
అప్పుడు తన లుక్ రివీల్ అయిపోతుందనే సాకుతూ ఎన్టీఆర్ ఆ సినిమా ప్రచారానికి, పంక్షన్ లకు దూరంగా వున్నారు. ఎన్టీఆర్ కు దగ్గరై, బాబాయ్ తో ఎడం పెంచుకున్నకళ్యాణ్ రామ్, ఎమ్మెల్యే ఫంక్షన్ కు బాలయ్యను కూడా పిలవలేకపోయారు. అడిగిన వాళ్లందరికీ త్రివిక్రమ్ సినిమా లుక్ రివీల్ అయిపోతుంది కాబట్టి తారక్ రాలేదు అని చెప్పుకుంటూ వచ్చారు.
పోనీ సినిమా విడుదలయిన తరువాత చూసాను, కమర్షియల్ గా బాగానే వుంది అని ట్వీట్ అన్నా ఎన్టీఆర్ వేసారా? అంటే అదీ లేదు. కానీ ఐపిఎల్ ప్రమోషన్ అంటే లుక్ రివీల్ అయిపోతుందని తెలిసినా వచ్చేసారు. ఐపిఎల్ ప్రకటన అంటే లుక్ రివీల్ అయిపోతుందన్నా నటించేసారు. పైగా రంగస్థలం సినిమా కోసం ఒకటి కాదు రెండు మూడు ట్వీట్ లు వేసారు. ఇది చూసి కళ్యాణ్ రామ్ కన్నా ఆయన సన్నిహితులు ఫీలవుతున్నారు.
పైగా జైలవకుశ సినిమా చేయడం ద్వారా కళ్యాణ్ రామ్ ను ఆదుకున్నాడని, కళ్యాణ్ రామ్ అప్పులన్నీ తీర్చేసాడని ఎన్టీఆర్ మీద బోలెడు పాజిటివ్ వార్తలు వున్నాయి. కానీ చిత్రం ఏమిటంటే, ఎన్టీఆర్ సినిమాకు దాదాపు 35కోట్ల వరకు మొహమాటం లేకుండా తీసుకున్నారన్న గుసగుసలు వున్నాయి. జైలవకుశతో కళ్యాణ్ రామ్ కు సినిమా చేయడం వరకు ఓకె కానీ, అదేదో ఫ్రీగా చేసినట్లు కానీ, బాకీలు తీర్చేసినట్లు కానీ వున్న ప్రచారం కానీ వాస్తవం కాదని కళ్యాణ్ రామ్ విషయాలు తెలిసిన వారు చెప్పే మాట.
మొత్తం మీద ఎమ్మెల్యే విషయంలో ఎన్టీఆర్ చేసిన విషయం కాస్త అసంతృప్తిని రాజేసినట్లు కనిపిస్తోంది.