దిల్ రాజుకు అంత నచ్చిందా?

ఉగాదినాడు ప్రత్యేకంగా సినిమా చూసారు దిల్ రాజు. అది కూడా విలక్షణ దర్శకుడు పూరిజగన్నాధ్ తన కొడుకు ఆకాష్ తో నిర్మించిన సినిమా. పూరిజగన్నాధ్ కోరిక మేరకు సినిమా చూసిన దిల్ రాజు, ఆ…

ఉగాదినాడు ప్రత్యేకంగా సినిమా చూసారు దిల్ రాజు. అది కూడా విలక్షణ దర్శకుడు పూరిజగన్నాధ్ తన కొడుకు ఆకాష్ తో నిర్మించిన సినిమా. పూరిజగన్నాధ్ కోరిక మేరకు సినిమా చూసిన దిల్ రాజు, ఆ సినిమాను తను అవుట్ రేట్ న తీసుకోవడానికి ఓకె అనేసారు. అయితే రేటు మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు.

ఈ మధ్య ఏదైనా సినిమా నచ్చితే, అవుట్ రేట్ గా కొనడం అన్నది స్టార్ట్ చేసారు దిల్ రాజు. ఆ మధ్య తొలిప్రేమ సినిమాను అలాగే కొన్నారు. వచ్చే నెల విడుదలయ్యే కృష్ణార్జున యుద్ధం కూడా అలాగే కొన్నారు.

ఇప్పుడు పూరిజగన్నాధ్ నిర్మించిన మెహబూబాను కూడా తీసుకుంటానని హామీ ఇచ్చాడు. అంటే ఆ సినిమా దిల్ రాజుకు అంతబాగా నచ్చివుండాలి. మనసు పెట్టి తీయాలే కానీ, పూరిజగన్నాధ్ బాగానే తీస్తారు. అందులో కొడుకు కోసం తీస్తున్నాడు కాబట్టి కాస్త జాగ్రత్తగానే తీసివుండొచ్చు. అందుకే దిల్ రాజుకు నచ్చి వుండొచ్చు.