మరో ప్రయోగానికి రవితేజ సై అంటాడా?

కాస్త కొత్త కథలు ప్రయత్నించినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతున్నాడు రవితేజ. రీసెంట్ గా అతడు చేసిన సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. రొటీన్ గా చేసిన టచ్ చేసి చూడు లాంటి సినిమాలు…

కాస్త కొత్త కథలు ప్రయత్నించినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతున్నాడు రవితేజ. రీసెంట్ గా అతడు చేసిన సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. రొటీన్ గా చేసిన టచ్ చేసి చూడు లాంటి సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. అంధుడి పాత్రలో చేసిన రాజా ది గ్రేట్ సినిమా ఆడింది. మరి ఇదే కోవలో మరో ప్రయోగానికి రవితేజ రెడీ అవుతాడా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న.

డిఫరెంట్ సినిమాలు తీసే వీఐ ఆనంద్, రవితేజ కోసం ఓ కథ రెడీ చేశాడు. గతంలో ఇతడు తీసిన ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి సినిమాల కంటే చాలా ప్రత్యేకమైన కథ అట. తాజాగా ఈ కథను రవితేజకు వినిపించాడు ఆనంద్. ప్రాజెక్టు ఓకే అయితే ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తళ్లూరి నిర్మాతగా సినిమా పట్టాలపైకి వస్తుంది. కానీ రవితేజ ఓకే చెబుతాడా లేదా అనేది డౌట్.

రాజా ది గ్రేట్ సినిమాలో అంధుడిగా నటించాడు రవితేజ. ఆ సినిమాలో హీరో అంధుడైనప్పటికీ పుష్కలంగా వినోదం పండింది. అసలు ఒక దశలో హీరో గుడ్డివాడు అంటే నమ్మలేం కూడా. అయితే వీఐ ఆనంద్ చెప్పిన ప్రయోగాత్మక కథలో వినోదానికి పెద్దగా ఆస్కారం లేదని తెలుస్తోంది. అక్కడక్కడ కామెడీ టచ్ ఉన్నప్పటికీ.. ఓవరాల్ గా సీరియస్ కథ అని టాక్. మరి ఇలాంటి కథలో రవితేజ నటిస్తాడా?