త్రివిక్రమ్…ఇళ్ల సెంటిమెంట్

రైటర్లకు.. దర్శకులకు సెంటిమెంట్లు ఎక్కువగా వుంటాయి.  అందులోనూ సినిమా జనాలకు మరీనూ. ఒక పాట్రన్ అలవాటు పడిపోతే ఇక అదే దోవన వెళ్తారు. కొత్తగా ఆలోచించడానికి మనసు అంగీరించదేమో?. Advertisement శ్రీను వైట్ల.. కోనవెంకట్…

రైటర్లకు.. దర్శకులకు సెంటిమెంట్లు ఎక్కువగా వుంటాయి.  అందులోనూ సినిమా జనాలకు మరీనూ. ఒక పాట్రన్ అలవాటు పడిపోతే ఇక అదే దోవన వెళ్తారు. కొత్తగా ఆలోచించడానికి మనసు అంగీరించదేమో?.

శ్రీను వైట్ల.. కోనవెంకట్ లాంటి వాళ్లు చాలా సినిమాలు ఎలా మొదలైనా సరే, ఓ ఇంట్లోకి చేరి కన్ఫ్యూజన్ కామెడీ చేయడం అన్నది ఓ పద్దతిగా వుండేది. దర్శకుడు త్రివిక్రమ్‌కు కూడా ఇలాంటి సెంటిమెంట్ వుంది. అదే ఇళ్ల సెంటిమెంట్. చాలా సినిమాల్లో ఓ ఇంటి సెట్ వుండాల్సిందే.

ఇండస్ట్రీలో ఓ కామెంట్ కూడా వినిపిస్తూ వుంటుంది. త్రివిక్రమ్ కథ రాయడం మొదలుపెడుతూనే ఆర్ట్ డైరక్టర్‌ను పిలిచి ఓ ఇంటి సెట్ వేసేయమంటారు అని. అది నిజమే అనిపిస్తుంది. మెజారిటీ సినిమాల సంగతి చూస్తే.

అతడు సినిమాలో నాజర్ ఇల్లు కీలకం. చాలా సినిమా అక్కడే జరుగుతుంది. ఆ ఇల్లు స్పెషల్ గా వుంటుంది.

జల్సాలో కింద పవన్ మీద ఇలియానా వుండే ఇల్లు సెట్ కీలకంగా వుంటుంది. అక్కడే చాల కామెడీ సీన్లు తీసారు.

జులాయిలో రాజేంద్ర ప్రసాద్ ఇల్లు కీలకం.

అత్తారింటికి దారేది సినిమాలో రావు రమేష్-నదియాల ఇల్లు కీలకం. చాలా సినిమా నడిచేది అక్కడే.

సన్నాఫ్ సత్యమూర్తిలో ఉపేంద్ర ఇంట్లో కథ కీలకంగా నడుస్తుంది.

అ..ఆ సినిమాలో నితిన్ ఇంటికి సమంత మారిన తరువాత కథ అంతా అక్కడే నడుస్తుంది.

అజ్ఙాతవాసిలో కొంచెం డిఫరెంట్ గా చేద్దామనేమో.. ఇంటికి బదులు ఆఫీసు ను వాడారు. కానీ అది కాస్తా యాంటీ సెంటిమెంట్ అయిపోయింది.

అరవిందసమేత సినిమాలో హీరోయిన్ ఇల్లు వుండనే వుంది.

అల వైకుంఠపురములో…టైటిల్ నే హీరో ఇంటి మీద. సినిమా అంతా అక్కడే నడుస్తుంది.

ఇప్పుడు లేటెస్ట్ గా గుంటూరు కారం కూడా రెండు ఇళ్లలో నడుస్తుందని తెలుస్తోంది. తాత ప్రకాష్ రాజ్ (గుంటూరు దగ్గర పల్లెటూరు) ఇల్లు, రెండవది హీరో తల్లి వుండే హైదరాబాద్ ఇల్లు అని బోగట్టా.

మొత్తం మీద త్రివిక్రమ్ పుణ్యమా అని ఆర్ట్ డైరక్టర్లు రకరకాల ఇళ్ల సెట్‌లు వేసి చూపిస్తున్నారు. ప్రతి ఇల్లు యూనిక్ గా వుంటూ, సినిమాలను చూసేలా చేస్తున్నాయి.