తెలుగులోకి హ్యూమా ఖురేషి

తెలుగులో హీరోయిన్ల కొరత కాస్త ఎక్కువే వుంది. అందులో సీనియర్ హీరోలయితే చెప్పక్కర్లేదు. మన సీనియర్లకు కోటి రూపాయలలోపులోనే హీరోయిన్ కావాలి. మళ్లీ గ్లామర్ వుండాలి. ఇంకా చాలా చాలా వుండాలి. కానీ హీరోల…

తెలుగులో హీరోయిన్ల కొరత కాస్త ఎక్కువే వుంది. అందులో సీనియర్ హీరోలయితే చెప్పక్కర్లేదు. మన సీనియర్లకు కోటి రూపాయలలోపులోనే హీరోయిన్ కావాలి. మళ్లీ గ్లామర్ వుండాలి. ఇంకా చాలా చాలా వుండాలి. కానీ హీరోల రెమ్యూనిరేషన్ ఎన్ని కోట్లు అయినా హీరోయిన్ మాత్రం కోటి లోపులే వుండాలి. అందుకే సరైన హీరోయిన్లు సెట్ కావడం సమస్య అవుతోంది. ఎక్కెడెక్కడో వెదుకుతున్నారు.

లేటెస్ట్ ఓ బాలీవుడ్ హీరోయిన్ మీద మనవాళ్లు కన్ను పడింది. ఓ సీనియర్ హీరో త్వరలో చేయబోయే సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషీని తీసుకురావాలని డిసైడ్ అయ్యారు.

ఆ సీనియర్ హీరో పక్కన మ్యాచ్ అవుతుందా లేదా అని డిజిటల్ గా జోడించి చూసారు. ఓకె అనిపించిందట. అందుకే ఇప్పుడు ఆమెను కాంట్రాక్టు చేసి ఒప్పించే పనిలో పడ్డారు. ఒక వారం దాటాక, ఆమెతో అగ్రిమెంట్ అయిపోతే అన్ని విషయాలు బయటకు వస్తాయి.

హ్యూమా ఖురేషీ బాలీవుడ్ జనాలకు బాగా పరిచితమే. రెండు పదులకు పైగా సినిమాల్లో నటించిన ఆమె తన నటనతోనూ, అందంతోనూ కూడా పాపులర్ అయింది. పలు అవార్డులు కూడా గెల్చుకుంది.