ఆమెకు హైదరాబాద్ లో పనేంటి..?

ఎవరూ ఊహించని విధంగా ఓ హీరోయిన్ హైదరాబాద్ లో ప్రత్యక్షమైంది. నిజానికి ఆ హీరోయిన్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు. హైదరాబాద్ లో షోరూం ఓపెనింగ్స్ కూడా లేవు. కానీ ఆమె హైదరాబాద్…

ఎవరూ ఊహించని విధంగా ఓ హీరోయిన్ హైదరాబాద్ లో ప్రత్యక్షమైంది. నిజానికి ఆ హీరోయిన్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు చేయడం లేదు. హైదరాబాద్ లో షోరూం ఓపెనింగ్స్ కూడా లేవు. కానీ ఆమె హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో దిగింది. 2రోజులు ఇక్కడే ఉంటుందట. ఓ షూటింగ్ పనిమీద విదేశాల్లో ఉన్న ఆమె, అట్నుంచి నేరుగా హైదరాబాద్ లో ల్యాండ్ అయింది.

ప్రభాస్, మహేష్, వెంకటేశ్, నాగార్జున.. ఇలా సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరితో సినిమాలు చేసి తెలుగులో ఓ వెలుగు వెలిగింది ఆ బ్యూటీ. సినీ కుటుంబానికి చెందిన ఓ హీరోతో డేటింగ్ చేసిందంటూ అప్పట్లో ఆమెపై పుకార్లు కూడా వచ్చాయి. అయితే ఇదంతా గతం. ఇప్పుడామెకు తెలుగులో అవకాశాలు రావడం లేదు. పూర్తిగా తమిళ సినిమాలకే పరిమితం అయిపోయింది.

ఇలాంటి టైమ్ లో హైదరాబాద్ వచ్చింది ఆ బ్యూటీ. పోనీ తన డబ్బింగ్ సినిమా ప్రమోషన్ కోసం వచ్చిందనుకుంటే.. ఆమె నటించిన సినిమాలేవీ తెలుగులో డబ్బింగ్ కు రెడీగా లేవు. మరి ఆమె ఎందుకొచ్చినట్టు? 

హైదరాబాద్ లో కొన్ని ఆర్థిక లావాదేవీలున్నాయట ఆమెకు. వాటిని సెటిల్ చేసుకోవడానికే వచ్చినట్టు చెబుతున్నారు. మరికొంతమంది మాత్రం ఆమె కొందరికి ఆనందం పంచేందుకే హైదరాబాద్ వచ్చిందంటున్నారు.