గీతాంజలి 2కి రంగం సిద్దం

గీతాంజలి అనగానే మణిరత్నం గీతాంజలితో పాటు, లేటెస్ట్ హీరోయిన్ అంజలి నటించిన గీతాంజలి కూడా గుర్తుకు వస్తుంది. ఈ హర్రర్ జోనర్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రెడీ చేస్తున్నారు. Advertisement మళ్లీ అదే బ్యానర్,…

గీతాంజలి అనగానే మణిరత్నం గీతాంజలితో పాటు, లేటెస్ట్ హీరోయిన్ అంజలి నటించిన గీతాంజలి కూడా గుర్తుకు వస్తుంది. ఈ హర్రర్ జోనర్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రెడీ చేస్తున్నారు.

మళ్లీ అదే బ్యానర్, అదే టీమ్ పని చేస్తుంది సీక్వెల్ కు కూడా. అయితే తొలి పార్ట్ లో కీలక పాత్రలో నటించిన శ్రీనివాసరెడ్డి వుండకపోవచ్చు. హీరోయిన్ గా అంజలి మాత్రం వుంటుంది.

ఎంవివి సినిమాస్ పతాకంపై ఎంవివి సత్యనారాయణ నిర్మించిన సినిమాకు తెర వెనకు కర్త, కర్మ, క్రియ కోన వెంకట్ నే. ఇప్పుడు రెండో ప్రాజెక్టుకూ ఆయనే డిజైనర్ అండ్ సమర్పకుడు కూడా. ఏప్రియల్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమా ప్రారంభమై, నెల రోజుల్లోనే వర్క్ ఫినిష్ చేసేసుకుంటుంది.

ప్రస్తుతం కోనవెంకట్, అదే నిర్మాత కలిసి ఆది పినిశెట్టి-తాప్సీతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. అది పూర్తి కాగానే ఈ సినిమా స్టార్ట్ చేస్తారు. పార్ట్ వన్ మాదిరిగానే ఇటు హర్రర్ అటు ఫన్ తో స్క్రిప్ట్ తయారు చేసారు.