ప్లీనరీ కాదు మహాసభ మాత్రమే

రాజకీయ పార్టీలకు ప్లీనరీలు, ఆవిర్భావదినోత్సవాలు, మహానాడులు ఇలా రకరకాల వ్యవహారాలు వుంటాయి. కమ్యూనిస్ట్ పార్టీలు మహాసభలు అంటాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ అంటుంది. తెలుగుదేశం పార్టీ మహానాడు అంటుంది. Advertisement పేరు ఏదైనా…

రాజకీయ పార్టీలకు ప్లీనరీలు, ఆవిర్భావదినోత్సవాలు, మహానాడులు ఇలా రకరకాల వ్యవహారాలు వుంటాయి. కమ్యూనిస్ట్ పార్టీలు మహాసభలు అంటాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ అంటుంది. తెలుగుదేశం పార్టీ మహానాడు అంటుంది.

పేరు ఏదైనా ఆ పేరిట పార్టీ పరిస్థితులు బేరీజు వేసుకోవడం, జమా ఖర్చులు, విరాళాల వివరాలు ప్రకటించడం, రాజకీయ తీర్మానాలు చేయడం, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం ఇలా చాలా వుంటాయి వ్యవహారాలు.

జనసేన తొలి ప్లీనరీ ఈ నెల 14న గుంటూరు దగ్గర జరుగుతుందని ఆది నుంచీ వార్తలు వినిపించాయి. అయితే ఇది ప్లీనరీ కాదని, కేవలం మహాసభ అని ఇప్పుడు క్లియర్ అయింది. ప్లీనరీ అయితే ముందుగా చెప్పుకున్నట్లు చాలా వ్యవహారాలుంటాయి. జనసేన తరపున పవన్ ఒక్కరే వేదిక పై వుంటారంటే నడవదు.

తీర్మానాలు తయారుచేయాలి. తీర్మానాలు ప్రవేశపెట్టాలి. గడచిన మూడేళ్లుగా జనసేన జమా ఖర్చులు చెప్పాలి. విరాళాల వివరాలు అందించాలి. ఇంకా చాలా వ్యవహారాలు వుంటాయి. కానీ పవన్ కు అవన్నీ సరిపడేవి కాదు. అందుకే ప్లీనరీ అనకుండా ఆవిర్భావ మహాసభ అనేస్తున్నారు. సింపుల్ గా అయిపోతుంది. వేదిక. దానిపై పవన్. ఆయన ప్రసంగం, జనాలు వినడం వెళ్లడం. అంతే.

అందుకే ప్లీనరీ అని వినిపించిన టాక్ కాస్తా, మహాసభగా మారింది. ఇప్పటికి ఇలాంటి సభలు చాలానే అయ్యాయి. ఇప్పుడు ఇది మరోటి. అయితే సభకు బదులు మహాసభ అన్నమాట.