లేటెస్ట్ డేట్ మార్చి 12

ఇదిగో తేజ, అదిగో వెంకీ.. సినిమా మాత్రం స్టార్ట్ కాదు. ఇప్పటికి చాలా ముహూర్తాలు వార్తల్లో వినిపిస్తూ, కనిపిస్తూనే వున్నాయి. కానీ సినిమా స్టార్ట్ కావడం లేదు. లేటెస్ట్ గా ఈ సినిమాకు మార్చి…

ఇదిగో తేజ, అదిగో వెంకీ.. సినిమా మాత్రం స్టార్ట్ కాదు. ఇప్పటికి చాలా ముహూర్తాలు వార్తల్లో వినిపిస్తూ, కనిపిస్తూనే వున్నాయి. కానీ సినిమా స్టార్ట్ కావడం లేదు. లేటెస్ట్ గా ఈ సినిమాకు మార్చి 12న ముహుర్తం ఫిక్స్ చేసారు. హీరోయిన్ గా శ్రియ ఆల్ మోస్ట్ ఫిక్స్. కాజల్ అనుకున్నారు కానీ, శ్రియనే ఫిక్సయినట్లు బోగట్టా.

సినిమా సెట్ మీదకు వెళ్తే, ప్రొడక్ట్ మూడు నెలల్లో బయటకు వస్తుంది. కానీ అదే ఎంతకూ కనిపించడం లేదు. ఇదిగో అదిగో అంటూ నడుస్తోంది వ్యవహారం. వెంకీతో పాటు నారా రోహిత్ కూడా ఓ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను ఫినిష్ చేసి, ఎన్టీఆర్ బయోపిక్ మీదకు వెళ్లాలి దర్శకుడు తేజ. అదే విధంగా ఈ సినిమా ఫినిష్ చేసి అనిల్ రావిపూడి-వరుణ్ తేజ సినిమా మీదకు వెళ్లాలి వెంకటేష్.

మార్చి 12ముహుర్తం మాత్రం పక్కా అని, అక్కడి నుంచి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుగుతుందని, చాలా మంది కొత్తవాళ్లని ఎంపిక చేయడం, వాళ్లకు ట్రయినింగ్ ఇవ్వడం జరుగుతోందని యూనిట్ వర్గాల బోగట్టా.